24 May, 2026 | 3:33 PM

Breaking News

అడ్డేసార సర్పంచ్ పంద్రం శేకును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు   •   లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు రూ.583 కోట్లు మంజూరు   •   పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మ దహనం   •   వడూర్ బుద్ధికొండ రహదారిపై పులి సంచారం సోషల్ మీడియాలో ప్రచారం   •   పుష్కరాలు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలకు ప్రతీక   •   రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   భారత్ లో పర్యటించడం గర్వకారణం: రూబియో   •   140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •  

భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తా

05-08-2025 01:29 AM

- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

- రష్యాతో వ్యాపారం చేయడమే కారణమని వ్యాఖ్య

వాషింగ్టన్, ఆగస్టు 4: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. ఇటీవల భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకం విధిస్తున్న ట్టు ప్రకటించిన ట్రంప్ తాజాగా మరిన్ని సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ట్రంప్ తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక ప్రకటన విడుదల చేశారు.

రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తుందని.. ఆ చమురును పెద్ద మొత్తంలో విక్రయిస్తోందన్నారు. బహిరంగ మార్కెట్‌లో చమురు విక్రయించి భారత్ లాభం పొందుతుందని అసహనం వ్యక్తం చేశారు. భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయ డం వల్ల రష్యాకు భారీగా ఆర్థిక వనరులు చేకూరుతున్నాయని, అందుకే ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడం లేదని విమర్శించారు. భారత్‌పై విధించిన 25 శాతం సుంకాలు, అద నపు పెనాల్టీ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చి న సంగతి తెలిసిందే.