calender_icon.png 14 March, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెనడా, ఈయూపై మరిన్ని సుంకాలు

14-03-2025 12:00:00 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్  ప్రతిజ్ఞ

వాళ్లు ఎంత వసూలు చేస్తే తామూ అంతే వసూలు చేస్తామని స్పష్టీకరణ

వాషింగ్టన్, మార్చి 13: ఐరోపా యూనియన్(ఈయూ), కెనడా ఉత్పత్తుల పై మరిన్ని సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఈ యూ ఉత్పత్తులపై మరిన్ని సుంకాలు వి ధించి, ప్రపంచ వాణి జ్య యుద్ధాన్ని తీవ్రతరం చేస్తానని హెచ్చరించారు. బుధవా రం వైట్‌హౌస్‌లోట్రంప్ కెనడా, ఈ యూని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘వాళ్లు మా నుంచి ఎంత వసూలు చేస్తే.. మే ము కూడా వాళ్ల నుంచి అంతే వసూలు చేస్తాం’ అన్నారు.

స్టీలు, అల్యూమినియం పై 25% సుంకాలు విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఈయూ స్పందించింది. 28 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది. స్టీ లు, అల్యూమినియాన్ని అమెరి కాకు పెద్ద మొత్తంలో ఎగుమతి చేస్తూ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న కెనడా సైతం అమెరికా కు చెందిన 20 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది.