calender_icon.png 22 October, 2024 | 5:46 AM

సీట్లు ఎక్కువ.. విద్యార్థులు తక్కువ!

22-10-2024 02:47:06 AM

  1. డిగ్రీలో 4.57 లక్షల్లో నిండినవి 2 లక్షల సీట్లే!
  2. ఏటా సగం సీట్లు ఖాళీయే
  3. సాంప్రదాయ కోర్సులకు తగ్గుతున్న ఆదరణ

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాం తి): రాష్ట్రంలో డిగ్రీ విద్యకు ఆదరణ తగ్గుతోంది. సాధారణ డిగ్రీ కోర్సుల పరిస్థితి దిగజారుతోంది. కోర్సుల్లో అడ్మిషన్లు పెరగాల్సిందిపోయి ప్రతి ఏటా తగ్గిపోవడం ఆందో ళన కల్గిస్తోంది. భవిష్యత్తులో కొన్ని కోర్సులు కనుమరుగయ్యే దుస్థితి ఏర్పడనుంది.

కాలేజీల పరిస్థితి దాదాపు అంతే. సీట్లు నిండ కుంటే కాలేజీలను నడపడం కష్టం. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు క్రమంగా మూతపడే స్థాయికి చేరుకుంటున్నాయి. ఇంజినీరింగ్‌లో అడ్మిషన్లు పెరుగుతుంటే డిగ్రీలో మాత్రం సీట్లు నిండడంలేదు. డిగ్రీలో విద్యార్థుల సంఖ్య కంటే సీట్లే ఎక్కువగా ఉంటున్నాయి.

దీంతో ప్రతి ఏడాది సగం వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. ఇక కొన్ని కాలేజీల్లోనైతే పది, ఇరువై సీట్లు కూడా నిండట్లేదు. కొన్ని కోర్సుల నిర్వహణకు అవసరమయ్యే విద్యార్థుల సంఖ్య ఉండడంలేదు. సీట్లు నిండేందుకు కొత్త కోర్సులను అధికారులు ప్రవేశ పెడుతున్నా, కొత్త కోర్సులు మినహా సాంప్రదాయ కోర్సు ల్లో సీట్లు భర్తీ కావడంలేదు.

నిండినవి రెండు లక్షలే..

ఈసారి డిగ్రీలో ఈసారి సగం సీట్ల కేంటే ఎక్కువగా మిగిలాయి. ఏకంగా 2.57 లక్షల సీట్లు మిగిలాయి. డిగ్రీలో 2024-25 విద్యాసంవత్సరానికి ఫస్టియర్‌లో 4,57,704 సీట్లుంటే, అందులో 2 లక్షల వరకు మాత్ర మే భర్తీ అయ్యాయి. అంటే ఇంకా 2,57, 704 వరకు సీట్లు మిగిలాయి.

రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్లను ప్రతి ఏటా దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ) ద్వారా భర్తీ చేస్తున్నారు. నాలుగైదు విడుతల్లోనూ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ సగం సీట్లు కూడా నిండట్లేదు. ఈ ఏడాది తొలుత మూడు విడుతల్లో కౌన్సెలింగ్ చేపట్టి సీట్లను భర్తీ చేశారు. తర్వాత స్పెషల్ డ్రైవ్ పేరుతో పలుసార్లు ప్రవేశాలకు అవకాశం కల్పించారు.

90 వేల మంది ఇంజినీరింగ్ వైపు..

ఇంటర్‌లో 3.90 లక్షల మంది విద్యార్థు లు మాత్రమే ఉత్తీర్ణత అవుతున్నారు. వీరిలో 90 వేల మంది ఇంజినీరింగ్ విద్య వైపు వెళ్తున్నారు. ఇంటర్ చదివిన విద్యార్థుల్లో కొందరు జేఈఈ మెయిన్స్ ద్వారా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సులకు వెళ్తుం టే, మరికొందరేమో టీజీ ఎప్‌సెట్ ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్ బీఎస్సీ వంటి కోర్సులవైపు వెళ్తున్నారు.

నీట్ ద్వారా ఎంబీబీఎస్ వంటి కోర్సులను ఎంచుకుంటు న్నారు. ఇలా ప్రతి ఏటా దాదాపు 90 వేల నుంచి లక్ష మంది విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరుతున్నారు. 3.90లో లక్ష వరకు పోతే మిగిలిన 2.90లక్షల మంది విద్యార్థుల్లో డిగ్రీలో చేరుతున్నది 2 లక్షల మందే. 

మరో 90 వేల మంది ఇతరత్రా కోర్సు లు, చదువును ఆపేయడం, వ్యాపారాలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. దీంతో డిగ్రీ సీట్ల కంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటోంది. 

కాలేజీల నిర్వహణపై ప్రభావం

రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు సంక్షోభంలో ఉన్నాయి. సీట్లు నిండకుం టే దాని ప్రభావం కాలేజీలపై పడుతోంది. నిర్వహణ భారం పెరిగి కాలేజీలు మూతపడే ప్రమాదం ఉంటుంది. గుర్తిం పు ఉన్న మంచి కాలేజీల్లో సీట్లు నిండుతున్నా, గ్రామీణ ప్రాంతాలు, ఇతర పట్ట ణాల్లోని చిన్న కాలేజీల్లో సీట్లు నిండడంలేదు.

రాష్ట్రంలోని 816 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 3,44,793 సీట్లకు ఈ విద్యాసంవత్సరం నిండినవి దాదాపు 1,36,388 మాత్రమే. అయితే యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సీట్లు మాత్రం 60 శాతం వరకు నిండుతున్నాయి. రాష్ట్రంలోని 160 ప్రభుత్వ కాలేజీల్లోని 89,337 సీట్లకుగానూ 55,361 సీట్లు నిండాయి. ఇక 79 రెసిడెన్షియల్ కాలేజీల్లోని 23,574 సీట్లలో 8,693 కాలేజీలు మాత్రమే నిండాయి.