ఎమ్మెల్యే గంగుల
కరీంనగర్, (విజయక్రాంతి): రాష్ట్రస్థాయిలో సాధించిన విజయాల స్ఫూర్తితో జాతీయస్థాయిలో ఎక్కువ పథకాలు సాధించి జిల్లాకే కాకుండా రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. ఇటీవల ఈనెల 14 15 తేదీల్లో హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి యోగాసన ఈడ పోటీలలో ఛాంపియన్షిప్ సాధించిన కరీంనగర్ క్రీడాకారులను ఎమ్మెల్యే బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని యోగ అంటే కరీంనగర్ జిల్లా గత 20 సంవత్సరాలుగా అన్ని కేటగిరీలలో విజేతలుగా నిలవడం అభినందనీయం అన్నారు.
క్రీడాకారులు రాబోయే జాతీయస్థాయిలో సైతం పథకాలు సాధించేలా జిల్లా యోగా అసోసియేషన్ ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించాలని కోరారు. జిల్లాలో యోగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న జిల్లా సంఘ బాధ్యతలు రవీందర్ సింగ్ సిద్ధారెడ్డి లను ఆయన అభినందించారు. రాష్ట్రస్థాయి యోగాసనం పోటీలో విశేషంగా రాణించి పథకాలు సాధించిన క్రీడాకారులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బుధవారం కరీంనగర్లో అభినందించారు. జాతీయ స్థాయిలో పథకాలు సాధించి కరీంనగర్కు మంచి పేరు తీసుకురావాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవీందర్ సింగ్ సిద్ధారెడ్డిలు ఉపాధ్యక్షులు కన్న కృష్ణ కోచులు రామకృష్ణ మల్లేశ్వరి ఆనంద కిషోర్ స్వరూప చార్యులు తదితరులు పాల్గొన్నారు.