ప్రస్తుతం ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంటున్నది. మహిళలకు ఉచిత ప్రయాణం ఉండడం వల్ల ఆర్డినరీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. చాలామంది విద్యార్థులు ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణాలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఉదయం కార్యాలయాలకు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేవాళ్లు సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకోవాలనుకుంటారు. అందువల్ల ఈ సమయాల్లో ఎక్కువ బస్సులు ఉంటే సౌకర్యంగా ఉంటుంది. సాధారణ బస్సులతోపాటుగా లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులను కూడా ప్రవేశపెడితే డబ్బు పెట్టి వెళ్లగలిగే వారు వాటిల్లో ప్రయాణించగలరు. ఆర్టీసీ వారు ఆ దిశగా చర్యలు చేపడితే బాగుంటుంది.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్