calender_icon.png 17 January, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదోన్నతితో మరింత బాధ్యత

17-01-2025 12:44:50 AM

  1. సంగారెడ్డి జిల్లాకు చెందిన 24 మంది ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి 
  2. అభినందించిన ఎస్పీ  చెన్నూరి రూపేష్ 

సంగారెడ్డి, జనవరి16 (విజయ క్రాంతి): సంగారెడ్డి జిల్లాకు చెందిన 24-మంది ఏ.ఎస్‌ఐ లకు ఎస్‌ఐ లుగా పదోన్నతి కలిస్తూ  మల్టీ జోన్- II ఐజి  వి.సత్యనారాయణ  ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. గురువారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో పదోన్నతి పొందిన ఏఎస్‌ఐలకు స్టార్ పెట్టి అభినందించారు. గత 30 సంవత్సరాలకు పైగా పోలీసు శాఖలో విధులు నిర్వహించి, సుధీర్గ సర్వీస్ లో ఎలాంటి రిమార్క్ లేకుండా సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొందిన అధికారులందరిని అభినందించారు.

ఎస్‌ఐ ర్యాంక్ చిహ్నంను అలకరించి  శుభాకాంక్షలు తెలిపారు.  పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత మరింత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్‌శాఖ పట్ల ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని మరింత పెంచే విధంగా చూడాలని, సర్వీసులో మరిన్ని ఉత్తమ సేవలను అందించి తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, రోజు వ్యాయా మం చేయాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎలాంటి విధుల నైనా సమర్దవంతంగా నిర్వహించగలమని, కుటుంబ సభ్యుల తో ఆనందంగా ఉండగలమని అన్నారు.  మానసికంగా శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి శారీరక శ్రమ, యోగా అవసరమని ఎస్పీ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో పదోన్నతి పొందిన ఎస్సైలు పాల్గొన్నారు.