calender_icon.png 29 November, 2024 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుతో వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు

29-11-2024 08:41:45 PM

జిల్లా విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ నీల శ్రావణ్‌కుమార్

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్‌లో ఐదు యం వి ఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను 80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ నీల శ్రావణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం సబ్‌స్టేషన్లో టాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటువల్ల వినియోగదారులకు మరింత  నాణ్యమైన సేవలు అందుతాయని తెలిపారు.

జయశంకర్‌కాలనీ, గుమాస్తాకాలనీ, కలెక్టర్ ఆపీస్, అడ్లూర్ ప్రాంత రైతులకు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ అందుబాటులో ఉంటుందన్నారు. సిరిసిల్లా రోడ్డు, సబ్‌స్టేషన్‌లో సమస్యలు ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించగలమని తెలిపారు. వేసవికాలంలో విద్యుత్ డిమాండ్‌ను ముందుగానే తీరుస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలను ఈ ట్రాన్స్‌ఫార్మర్ అందజేస్తుందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న టోల్ ప్రీ నంబర్ 1912 ద్వారా తెలుపవచ్చన్నారు. సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని వినియోగదారులను ఆయన కొరారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ డిఈ  ప్రభాకర్, యంఆర్‌పీ డిఈ నాగరాజు, ఏడిఈ కిరణ్‌చైతన్య, జయరాజ్, ఏఈలు శ్రీనివాస్, హన్మంత్‌రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.