calender_icon.png 10 January, 2025 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యశాఖలో మరో 371 పోస్టులు

12-10-2024 02:30:38 AM

272 స్టాఫ్‌నర్సులు, 99 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ

మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): వైద్య ఆరోగ్యశాఖలో కొలువుల జాతర కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 7,300 పోస్టులను భర్తీ చేయగా, మరో 6,500 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.

తాజాగా మరో 272 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్సులు), 99 ఫార్మసిస్టుల (గ్రేడ్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెల 18న విడుదల చేసిన 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు తాజాగా విడుదల చేసిన 272 పోస్టులు అదనమని నోటిఫికేషన్‌లో వెల్లడిం చారు.

దీంతో మొత్తం నర్సింగ్ ఆఫీసర్ ఖాళీల సంఖ్య 2,322కు పెరిగింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలవగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లయ్ చేసుకునే అవకాశం ఉంది. నవంబర్ 17వ తేదీన ఆన్‌లైన్ ద్వారా (కంప్యూటర్ బేస్డ్) రాత పరీక్ష నిర్వహించనున్నారు. 

732 ఫార్మసిస్టు పోస్టులు 

గత నెల 24వ తేదీన 633 ఫార్మసిస్ట్ (గ్రేడ్‌ెే2) పోస్టులకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇదే నోటిఫికేషన్‌కు అదనంగా 99 పోస్టులను జత చేస్తున్నామని దీంతో పోస్టుల సంఖ్య 732కు పెరిగిందని బోర్డు శుక్రవారం వెల్లడించింది.

ఈ పోస్టులకు అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువుగా నిర్ణయించారు. నవంబర్ 30వ తేదీన ఆన్‌లైన్ ద్వారా రాత పరీక్ష నిర్వహిస్తారు. జోన్లు, కేటగిరీల వారీగా ఖాళీల సంఖ్యను వెబ్‌సైట్  (https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm) లో అందుబాటులో ఉంచారు.