calender_icon.png 13 February, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగరాజన్‌పై దాడి కేసులో మరో 8 మంది అరెస్ట్

13-02-2025 01:38:55 AM

చేవెళ్ల, ఫిబ్రవరి 12: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో పో  మరో 8 మందిని గురు  అరెస్ట్ చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి సహా ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు బుధవారం ఏపీలోని శ్రీకాకులం జిల్లాకు చెందిన ఐదుగురు, వరంగల్‌కు చెందిన ఒకరు, భద్రచలానికి చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

కేసులో ఏ7 ఉన్న షేక్‌పే  నివాసం ఉంటున్న బడా  శ్రీని  రిమాండ్‌కు తరలించారు. అలాగే దేవిరెడ్డి వీరబాబు, రేగన మూర్తి, జంపాల గోవింద్‌రావు, లాక్కోజి వెంకట  ముప్పాడి వెంకటరమణ ఏపీ నుంచి ట్రాన్సిట్ రిమాండ్ ద్వారా మొయినాబాద్ పీఎస్‌కు తీసుకువస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికి ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, మొయినాబాద్ సీఐ పవన్  రెడ్డి తెలిపారు.