calender_icon.png 28 November, 2024 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్‌కు మరింత సోయగం

28-11-2024 12:07:35 AM

  1. పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు 
  2. స్టార్ హోటళ్లు, కాటేజీలు నిర్మించాలని యోచన
  3. నిధులు కేటాయించాలని కేంద్రానికి ప్రతిపాదన

నల్లగొండ, నవంబర్ 27 (విజయక్రాంతి): ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు మరిన్ని సొగబులు అద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నది. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద రూ.100 కోట్లు కేటాయించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతి పాదనలకు పంపింది.

ఈ నిధులతో సాగర్‌తోపాటు పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అనువైనచోట స్టార్ హోటళ్లు, కాటేజీలు, జలాశయంలో వాటర్ గేమ్స్, స్పీడ్ బోట్లు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నది. 

చాకలిగట్టుపై కాటేజీల నిర్మాణం

దేశ, విదేశాల నుంచి పర్యాటకులు నాగార్జునసాగర్‌కు వస్తుంటారు. వీరు బస చేసేం దుకు సాగర్ జలాశయం మధ్యలో ఉన్న చాకలిగట్టుపై కాటేజీలు నిర్మించాలని ప్రభు త్వం భావిస్తున్నది. 500 ఎకరాలకుపైగా ఐలాండ్‌ను తలపించేలా ఉన్న ఈ ప్రాంతం లో అటవీశాఖ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏకో టూరిజం అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది.

ఇక్క డ కాటేజీల నిర్మాణానికి ఇప్పటికే మూడు కన్సల్టెన్సీ ఏజెన్సీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్ప టికే ఇవి అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సైతం అందించాయి. ఈ ప్రాజెక్టు నివేదిక ఆధారంగా నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. 

బుద్ధవనంలో డిజిటల్ మ్యూజియం

బుద్ధవనంలో డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. 2,500 చిత్రాలతో బుద్ధుడి జీవిత విశేషాలు వివరించేలా మ్యూ జియం అందుబాటులోకి తేవాలని సర్కారు భావిస్తున్నది. ఇందుకు రూ.25 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిసింది. దీనితోపాటు వివిధ బౌద్ధ దేశాల నుంచి సాగర్ పర్యటనకు వచ్చే వారికి ఉపయుక్తంగా ఉండేలా బౌద్ధ  విశ్వవిద్యాలయం, గ్రంథాలయం, పరిశోధక విద్యార్థులు ఉండేందుకు గదులు నిర్మించే అవకాశం ఉంది. 

బ్యాక్‌వాటర్‌లో వాటర్ గేమ్స్

సాగర్ జలాశయం వెనుక జలాల్లో వాటర్ గేమ్స్, స్పీడ్ బోట్లు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది. దేవ రకొండ నియోజకవర్గం చందంపేట మం డల పరిధిలోని వైజాగ్ కాలనీలో కాటేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిం ది. ఈ ప్రతిపాదనలకు కేంద్రంలోని ఎన్‌డీఏ ప్ర భుత్వం అనుమతి తెలిపితే నాగార్జున సాగర్‌తోపాటు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

జలాశయం తీరంలో స్టార్ హోటళ్లు

సాగర్ తీరంలో పర్యాటకుల కోసం స్టార్ హోటళ్లు నిర్మించేం దుకు ప్రభు త్వం కసరత్తు చేస్తున్నది. ఇటీవల శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాప కుడు కమలేష్ డీ పటేల్ (దాదాజీ)తో కలిసి సాగర్ పర్యాటనకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు స్టార్ హోటళ్లు నిర్మించనున్నట్లు  ప్రకటించారు.

వెంటనే జలా శయం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌ను ఆదేశించారు. స్థలాలు గుర్తించే పనిలో రెవె న్యూ అధికారులు నిమగ్నమయ్యారు. మంత్రి సూచనతో బుద్ధవనం, విపస్సన పరిసరాల్లో ధాన్యం కేంద్రం ఏర్పాటుకు భూములను పరిశీలిస్తున్నారు.

నిధులు తీసుకొచ్చేందుకు కృషి

సాగర్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ఇప్పటికే పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి తో ఇక్కడ పర్యాటక అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై చర్చించాం. చేపట్టాల్సిన పనులకు అంచనాలు,  పూర్తి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కేంద్రం నిధులు విడుదల చేస్తే పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. 

 కుందూరు రఘువీర్‌రెడ్డి, 

ఎంపీ, నల్లగొండ