ప్రభుత్వం ఇటీవలే కొన్ని కొత్త మండలాలను ప్రకటించింది. ఇంకా, కొన్ని గ్రామాలను మండలాలుగా ప్రకటించవలసి ఉంది. ఇప్పటికే వున్న పలు మండలాల పరిధిలో చాలా ఎక్కువగా ఊళ్లు ఉన్నాయి. వాటిని మంచి వ్యాపార కేంద్రాల గ్రామాలతో అనుసంధానించాలి. అప్పుడు ప్రజలకు పనులు కూడా తేలికవుతాయి. కొత్త ఉద్యోగాల ఆవశ్యకత పెరుగుతుంది. ఈ మేరకు అన్ని మండలాలలో మౌలిక వసతులు కల్పించాలి. షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్