calender_icon.png 9 January, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రోకు మరో 10 కొత్త రైళ్లు

09-01-2025 12:54:21 AM

  1. కంపెనీలతో మెట్రో అధికారుల సంప్రదింపులు
  2. పట్టాలెక్కడానికి మరో 18 నెలలు పట్టే అవకాశం 
  3. ఇక అదనపు బోగీలు లేనట్లే 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (విజయక్రాంతి): దేశంలోని రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో హైదరాబాద్ మెట్రో ఒకటి. ప్రస్తుతం నగరంలో మూడు కోచ్‌లతో మె  రైళ్లు సర్వీసులు అందిస్తున్నాయి. రోజప 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. అందుకోసం 57 మెట్రో రైళ్ల ద్వారా దాదాపు 1,100 సర్వీసులను నడుపుతన్నారు.

అయితే ఉదయం, సాయంత్రం వేళ  ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమా  మెట్రో రద్దీ ప్రస్తావన వచ్చిన విష  తెలిసిందే. దీనిపై ఐటీమంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ నివారణకు ప్రస్తుతమున్న మూడు కోచ్‌లను ఆరు కోచ్‌లకు అప్‌గ్రేడ్ చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

మెట్రో  రద్దీకి పరిష్కారం చూపే దిశగా ఎల్‌అండ్‌టీ మెట్రో, హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. త్వరలో 10 కొత్త రైళ్లను తీసుకురావాలని యోచిస్తున్నట్లు బుధవారం జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి వెల్లడించారు. దీంతో ఇక మెట్రో రైళ్లలో అదనపు బోగీలు ఇక లేనట్లేనని స్పష్ట  

స్వదేశీ కంపెనీలతో సంప్రదింపులు.. 

ప్రస్తుతం ఉన్న మూడు కోచ్‌లను ఆరుకు పెంచుతామని గతంలో మెట్రో అధికారులు ప్రకటించారు. అందుకోసం నాగ్‌పూర్, పూణే నుంచి మెట్రో కోచ్‌లను తీసుకొస్తామన్నారు. కానీ ఆ ప్రాంతాల్లో పెరిగిన ప్రయాణికులు, కోచ్‌లకు చెల్లించాల్సిన చార్జీలు భారీగా ఉండే అవకాశం ఉండటంతో కొత్త రైళ్లను తీసుకువచ్చేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు.

ప్రస్తుతం ఉన్న మెట్రో రైళ్లను సౌత్‌కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారు. గతంలో మెట్రోకు రైళ్లను సరఫరా చేసిన కంపెనీ ఇప్పుడు భారత్‌కు తన ఎగుమతులను నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న మెట్రో రైళ్లకు అనుగుణంగా కొత్త రైళ్లు కావాలంటే సమస్య ఏర్పడింది.

ఈ నేపథ్యంలో మెట్రో అధికారులు దేశంలోని పలు మెట్రో రైల్ తయారీ కంపెనీలను సంప్రదించారు. అయితే కొత్త రైళ్లను తయారు చేయడానికి 10 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

పీక్ అవర్స్‌లో లూప్‌లైన్ సర్వీసులు..

ప్రస్తుతం ఉన్న మూడు కారిడార్లలో బ్లూ లైన్(నాగోల్-రాయ్‌దుర్గ్ )లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నట్లు మెట్రో అధికారులు గుర్తించారు. ఈ లైన్‌లో ఎక్కువగా హైటెక్ సిటీ, గచ్చిబౌలికి వెళ్లే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రాకపోకలు సాగిస్తుంటారు.

ఉదయం నాగోల్ వైపు నుంచి ఆఫీసులకు వెళ్లేటప్పుడు సాయంత్రం రాయదుర్గ్ వైపు నుంచి ఇండ్లకు వెళ్లేటప్పుడు వీరికి ఇతర ప్రయాణికులు తోడవడంతో రద్దీ పెరుగుతోంది. ఈ దృష్ట్యా మెట్రో అధికారులు ఇప్పటికే పీక్ అవర్స్‌లో లూప్‌లైన్ సర్వీసులను నడుపుతున్నారు. మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చేంత వరకు వీటితోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.