calender_icon.png 16 April, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరిన్ని ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు?

05-04-2025 01:13:59 AM

  1. త్వరలో ఏర్పాటు చేసేందుకు సర్కార్ చర్యలు 
  2. బీర్ల కొరత రాకుండా ఎక్సుజ్ శాఖ ప్రణాళికలు

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరిన్ని ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లకు అనుమతినిచ్చేందుకు తెలంగాణ ఎక్సుజ్ శాఖ సిద్ధమవుతోంది. గతంలో ఇచ్చిన కేఫ్‌లకు అదనంగా మరిన్ని బీర్ కేఫ్‌లకు (మైక్రో బ్రూవరీలు) అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.

మైక్రో బ్రూ వరీ లు మొదటగా బెంగళూరులో ఉండగా, 2016లో తెలంగాణలో వాటిని ప్రారంభించారు. మొదటగా 8 బీరు కేఫ్‌లకు అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతిరోజూ 1,000 లీటర్ల బీరును ఉత్పత్తి చేసుకునేలా ఆయా కేఫ్‌లను ఏర్పాటు చేశారు. ఈ కేఫ్‌ల్లో ఉత్పత్తి అయ్యే బీరుకు సంబంధించి ఒక లీటర్‌కు రూ.48లను ప్రభుత్వానికి చెల్లించాలని అప్పట్లో ప్రభుత్వం నిబంధన విధించింది.

అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయా కేఫ్‌ల నుంచి ప్రభుత్వానికి బకాయిలు భారీగా పేరుకుపోతుండటంతో మరిన్ని కేఫ్‌లకు అనుమతి ఇచ్చి నిబంధనలను సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యం లోనే కొత్తగా 80 కేఫ్‌లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని ఎక్సుజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ప్రతి సిటీలో ప్రతీ 3 కిలోమీటర్‌కు ఒకటి, గ్రామీణ ప్రాంతాలు, జిల్లా లో అయితే 30 కిలోమీటర్ల దూరంలో ఈ కేఫ్‌లు ఉండేలా ఎక్సుజ్ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. రానున్న వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్సుజ్ శాఖ ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చినట్టు తెలిసింది.