calender_icon.png 9 February, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల్లోనే ఎక్కువ..

09-02-2025 12:00:00 AM

మైగ్రేన్.. తలనొప్పికి భిన్నంగా ఉంటుంది. తలలోని ఏ భాగానికైనా రావచ్చు. ఈ నొప్పి చాలా ప్రమాదకరమైనది. అనేక నివేదికల ప్రకారం మైగ్రేన్ గుండె ను కూడా ప్రభావితం చేస్తుంది. ఇంతకుముందు పెద్దవాళ్లు మాత్రమే ఈ సమస్యతో బాధపడేవారు. కానీ ఇప్పుడు ఇది ఎవరికైనా వస్తుంది. అయితే ఈ సమస్య ఎక్కువగా మహిళల్లో వస్తోందని నివేదికలు చెబుతున్నాయి.

మైగ్రేన్ నొప్పి అకస్మాత్తుగా వస్తుంది. కొంతమంది ఈ నొప్పిని సాధారణ తలనొప్పిగా భావించి ఏదైనా మందులు తీసుకుంటారు. ఒక వైపు తలనొప్పి ఎక్కువగా వస్తుంది. దీని లక్షణాల గురించి చెప్పాలంటే, వాంతులు, అజీర్ణం, కళ్ల ముందు నల్లటి మచ్చలు కనిపించడం, బలహీనత, చిరాకుగా అనిపించడం వంటివి మైగ్రేన్ సంకేతాలు.

అయితే దానిని నివారించడం చాలా ముఖ్యం. లేకుంటే ఈ నొప్పి చాలా కాలం పాటు ఉంటుంది. దాని చికిత్స కోసం మంచి వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. మంచి నిద్ర కూడా నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. మసాలా, కారంగా ఉండే ఆహారాన్ని తగ్గించండి. మహిళలు రోజూ యోగా, వ్యాయామం చేయడం వల్ల కూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.