హైదరాబాద్‌లో రూ.79,000 దాటిన తులం ధర
హైదరాబాద్, జనవరి 9: అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో వరుసగా రెండో రోజూ బంగారం ధర ఎగిసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం రూ. 1,100 ఎగిసిన ధర గరువారం మరో రూ.380 పెరిగి రూ.79,000 స్థాయిని అధిగమించింది. ప్రపంచ మార్కె ట్లో ధర అధికకావడం, మరోవైపు రూపాయి మరింత పడిపోవడంతో పుత్తడి ధర పెరిగిందని బులియన్ ట్రేడర్లు చెపుతున్నారు.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పెరిగి రూ. 79,200 వద్ద ముగిసింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర మరో రూ.350 ఎగిసి రూ.72,600 వద్ద నిలిచింది. న్యూఢిల్లీ మార్కెట్‌లో పూర్తి స్వచ్ఛత కలిగిన పసిడి ధర తిరిగి రూ.80,000 స్థాయిని దాటేసింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్ రెండు నెలల గరిష్ఠస్థాయి 2,692 డాలర్ల స్థాయికి పెరిగింది. దీనితో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో 10 గ్రాముల పసిడి ఫ్యూచర్ రూ.470 వరకూ పెరిగగి రూ.78,200 వద్దకు చేరింది.