calender_icon.png 10 January, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరింత ఎగిసిన బంగారం

12-12-2024 12:00:00 AM

  1. వరుస రెండు రోజుల్లో రూ. 1,690 పెరుగుదల
  2. హైదరాబాద్‌లో రూ.79,500 స్థాయికి తులం ధర

హైదరాబాద్, డిసెంబర్ 11: కొద్ది రోజులుగా పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం హఠాత్తుగా పరుగు తీస్తున్నది. ప్రపంచ మార్కెట్లో ఎగిసిన నేపథ్యంలో  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం రూ.79,500 స్థాయిని సమీపించింది. మంగళవారం రూ.820 పెరిగిన ధర తాజాగా మరో రూ.870 మేర ఎగిసి రూ.79,470 వద్ద నిలిచింది. వరుస రెండు రోజుల్లో ఇది రూ.1,690 మేర పెరిగింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర మరో రూ.800 పెరిగి రూ.72,850 వద్ద కు చేరింది.

ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర తిరిగి రూ.80,000 స్థాయిని అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పుత్తడి ఫ్యూచర్ ధర భారీగా వరుస రెండు రోజు ల్లో 50 డాలర్లుపైగా పెరిగి 2,730డాలర్ల స్థాయిని అందుకుంది. ఇందుకు అనుగుణంగా బుధవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో 10 గ్రాముల బంగారం ఫ్యూచర్ రూ.78,400 స్థాయి వద్ద కదులుతున్నది.

ప్రపంచ మార్కెట్లో వారం రోజుల క్రితం 2,600 డాలర్ల సమీపంలో ఉన్న బంగారం వేగంగా 2,700 డాలర్ల స్థాయిని దాటడంతో దేశీయంగా ధరలు పెరిగాయని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. ఫెడ్ రేట్ల తగ్గింపు అంచనాలు, భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు పుత్తడి పెరుగుదలకు కారణమని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్ట్ మానవ్ మోది తెలిపారు.