15-04-2025 10:12:15 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ జన సమితి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గా మోరె గణేష్ ను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సోమవారం నియామక పత్రం అందించారు. మోరె గణేష్ శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందినవారు. తాను ప్రస్తుతం టీజేఎస్ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గా పనిచేస్తున్నారు. వెలుగు నీడ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షునిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన టీజెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కర్రె సతీశ్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.