18-03-2025 01:08:05 AM
గవర్నర్‌కు ఎమ్మెల్సీ కొమరయ్య విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): రాష్ర్ట బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కొమరయ్య మర్యాద పూర్వకంగా కలిశారు.
రెండు రోజుల్లో సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కోఠారి కమిషన్ నివేదిక ప్రకారం బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. టీచర్ల పెండింగ్ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. కొమరయ్యతో పాటు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు హన్మంత రావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ పాల్గొన్నారు.