గద్వాల (వనపర్తి )(విజయక్రాంతి ) : ఈనెల 23 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో గద్వాల నియోజకవర్గంను అధిక నిధులను మంజూరు చేయాలనీ ప్రభుత్వ సలహాదారులు నరేందర్ రెడ్డి ని మాజీ జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరిత కోరారు. సోమవారం ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు,నిరుద్యోగ సమస్య పరిష్కారంకై పరిశ్రమల ఏర్పాటుకు,పలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణకై, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణం కోసం అధిక నిధులు మంజూరు చేయించాలని ఆమె కోరుతూ వినతి పత్రాన్ని అందచేసారు.