ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): గంజాయి, డ్రగ్స్, ఎన్‌డీపీఎల్ నియంత్రణపై మరింత దృష్టి సారించాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాంపల్లిలోని అబ్కారీ భవన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ పనితీరును ఆయన సమీక్షించారు.
ఆయన మాట్లాడుతూ.. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది పనితీరు బాగుందని ప్రశంసించారు. ధూల్‌పేట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో సత్ఫలితాలు సాధించార న్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌టీఎఫ్ టీం లీడర్ ప్రదీప్‌రావు ఆధ్వర్యంలో రేవ్‌పార్టీ, ఆల్ఫ్రోజోలం సరఫరాలో కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారని చెప్పారు.
సివిల్ పోలీసుల విభాగంలో డీఎస్పీ తిరుపతి యాదవ్, తుల శ్రీనివాస్ పని తీరు బాగుందని అభినందించారు. ఇతర రాష్ట్రాల నుంచి నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం దిగుమతి కాకుండా దృష్టి సారించాలని సూచించారు. ఎస్‌టీఎఫ్ టీముల్లో బాగా పని చేసిన 31మందికి ప్రశంసాపత్రాలు అందించారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషీ, అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.