హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడకు రాష్ట్రం లో మరింత ప్రోత్సాహం కల్పిస్తామని జాతీయ జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో బ్యా డ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ వికారాబాద్ జి ల్లా నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చే శారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు గోపీచంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జి రమేష్, జనరల్ సెక్రటరీ యువిఎన్ బాబు, ఆర్ సుభాష్ రెడ్డి, కోశాధికారి పివిఎల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.