calender_icon.png 16 November, 2024 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరింత దిగిన బంగారం

15-11-2024 12:00:00 AM

  1. హైదరాబాద్‌లో మరో  రూ.1,200 తగ్గిన తులం ధర
  2. ట్రంప్ గెలుపు తర్వాత రూ.5,000 తగ్గుదల

హైదరాబాద్, నవంబర్ 14: పెండ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదార్లకు ఊరటనిస్తూ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.  హైదరాబాద్ బులియన్ మార్కె ట్లో గురువారం 24 క్యారెట్ల తులం బంగా రం ధర మరో రూ. 1,200 తగ్గి రూ. రూ. 75,650 వద్దకు చేరింది. అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంతో మొదలైన  బంగారం ధర క్షీణత కొనసాగుతున్నది.

గత పది రోజు ల్లో తులం ధర  రూ.5,000 వరకూ దిగివచ్చింది. తాజాగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ.1,100 తగ్గి, 69,350 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం భారీగా తగ్గడ మే దేశీయంగా దిగిరావడానికి కారణమని బులియన్ ట్రేడర్లు తెలిపారు.

ప్రపం చ మార్కెట్లో బుధవారం రాత్రి ఔన్సు పుత్తడి ఫ్యూచర్ ధర మరో 30 డాలర్లకుపైగా పడిపోయి 2,550 డాలర్ల స్థాయికి పతనమయ్యింది. ఫలితంగా దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో 10 గ్రాముల పూర్తి స్వచ్ఛతగలిగిన పసిడి ఫ్యూచర్ ధర గురువారం ఒకదశలో రూ.900 మేర క్షీణించి రూ.73,500 స్థాయికి తగ్గింది. కడపటి సమాచారం అందేసరికి ఇది రూ.74,100 సమీపంలో ట్రేడవుతున్నది. 

ఇంకా తగ్గే అవకాశం

అంతర్జాతీయ మార్కెట్లో 26,000 డాలర్ల దిగువన కొనసాగితే రానున్న కొద్ది రోజుల్లో ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర రూ.72,000 వరకూ తగ్గవచ్చని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది అంచనా వేశారు. డాలరు ఇండెక్స్ ఏడాది గరిష్ఠస్థాయి 106.80 వద్దకు పెరిగినందున, బంగారం ధర క్షీణత కొనసాగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ విశ్లేషకుడు సౌమిల్ గాంధి చెప్పారు. 

రూ.లక్షలోపునకు కేజీ వెండి

బంగారం బాటలోనే వెండి ధర సైతం భారీగా తగ్గుతున్నది. గురువారం కేజీ వెండి ధర రూ.2,000 మేర తగ్గి రూ. 99,000కు చేరింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 30 డాలర్లలోపునకు పడిపోయింది.