calender_icon.png 16 March, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంకెన్నా ళ్లీ డైవర్షన్ పాలిటిక్స్..?

16-03-2025 12:53:11 AM

  • డీలిమిటేషన్‌పై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు
  • కేంద్రాన్ని బదనాం చేయడమంటే సూర్యుడిపై ఉమ్మేయడమే
  • బీఆర్‌ఎస్‌ను పెంచి బీజేపీని దెబ్బతీసేందుకు కుట్ర
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, మార్చి 15 (విజయక్రాంతి): తెలంగాణకు నిధులివ్వడం లేదని కేంద్రాన్ని బదనాం చేయడమంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌పై కేంద్రం గైడ్‌లైన్స్ రూపొందించలేదని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నిర్ణయమే తీసుకోనప్పుడు దక్షిణాదికి అన్యా  చేస్తున్నారని ఆరోపించడం అన్యాయమన్నారు.

తమిళనాడులో డీఎంకే, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు లేని సమస్యలు సృష్టించి కేంద్రాన్ని బదనాం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలపై చర్చను దారిమళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, కాంగ్రెస్‌కు దమ్ముంటే ఆరు గ్యారంటీలపై అఖిలపక్షం నిర్వహించాలన్నారు. అసెంబ్లీలో ఆ హామీలపై చర్చించాలన్నారు. పంటలకు నీళ్లందక 10 లక్షల ఎకరాల పంట ఎండిపోతుంటే పట్టించుకోవడం లేదని, నీళ్లుండి కూడా సరైన ప్రణాళిక లేక రైతులు అల్లాడుతున్నారని అన్నారు.

ఈ విషయాలపై చర్చిం చకుండా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయని అన్నారు. అసెంబ్లీలో మా జీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ నిర్ణయం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డ్రామాలో భాగమేనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ రెండు పార్టీలకు దిక్కుతోచడం లేదన్నారు. అందుకే అసెంబ్లీలో సస్సె న్షన్ పేరుతో బీఆర్‌ఎస్ కు మో ఆయుధానాన్ని కాంగ్రెస్ అందించిండన్నారు.

రాజా సింగ్ వ్యాఖ్యలను తాను వినలేదని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే రహస్య భేటీలు జరు గుతున్నాయని, రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్ పాత్ర ఉందని తెలిసినా ఎందుకు అరెస్టు చేయడం లేదని, ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డి హయాంలోనే దర్జాగా విదేశాలకు వెళ్లిపోతే ఎందుకు అడ్డుకోలేదని ప్ర శ్నించారు.

డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించాలన్నారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వద్దనున్న వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను అమ్ముతూ దో చుకోవాలని చూస్తున్నారని అన్నారు. సమా  మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ వై సునీల్‌రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.

డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలి

డ్రగ్స్ విక్రయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, దానిపై ఉక్కుపాదం మోపా  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం కరీంనగర్‌లో మహిళాభివృద్ధిశాఖ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా వందమంది ప్రభుత్వ పాఠశాల బాలికలకు సైకిళ్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న పిల్లల ద్వారా డ్రగ్స్ విక్రయిస్తూ దందా కొనసాగిస్తున్నారని చెప్పారు. డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రెయినీ కలెక్టర్ అజయ్ యాదవ్, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మెంబర్ శోభారాణి, జిల్లా సంక్షేమ అధికారి సబిత, ఎస్బీఐ ఏజీఎం వెంకటేశ్ పాల్గొన్నారు.