calender_icon.png 30 November, 2024 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈపీఎస్‌లో మరింత జమకు అనుమతి!

30-11-2024 03:04:13 AM

కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, నవంబర్ 29: ఉద్యోగుల పింఛన్ పథకం  కొన్ని మార్పులు చేసి, ఉద్యోగులకు ఎక్కువ మొత్తంలో పదవీ విరమణ ప్రయోజనాలు అందించాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధిక మొత్తాలను ఈపీఎస్ కోసం జమ చేసే విషయమై  కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సభ్యులు తమ మూలవేతనంపై ఉదోగ భవిష్యనిధి సంస్థకు జమచేసే 12% మొత్తం వారి పీఎఫ్ ఖాతాలోకి వెళ్తోంది.

యాజమాన్యం నుంచి వచ్చే మరో 12 శాతంలో 8.33% ఈపీఎస్‌ెే95 లోకి, మిగిలిన 3.67% ఉద్యోగి పీఎఫ్ ఖాతాలోకి జమ అవుతోంది. ఈపీఎస్  95లో ఎక్కువ జమ చేస్తే సభ్యులకు వచ్చే పింఛన్ కూడా పెరితుంది కాబట్టి ఆ మేరకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కార్మికశాఖ ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగులు సైతం అధిక మొత్తంలో దాచుకొని పింఛన్ లబ్ధిని పెంచుకునేలా పర్మిషన్ మంజూరు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపాయి.