పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
హైదరాబాద్, జూలై 17 ( విజయక్రాంతి): రానున్న ఐదు రోజలు తెలంగాణలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 19 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భూపాల్‌పల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వా ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల వారు గురువారం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. బుధవారం నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమో దు కాగా, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూ ల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జల్లాల్లో మోస్తరు వర్షం కురిసిందని అధికారులు తెలిపారు.