calender_icon.png 8 February, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు మరింత ‘సహకారం’

08-02-2025 12:00:00 AM

  • సిద్దిపేటలో మరో 16 వ్యవసాయ సహకార సంఘాలు 

ప్రతిపాదనలు పంపించిన అధికారులు

నూతన మండలాలలో ఏర్పాటు

సిద్దిపేట, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) : రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు గ్రామీ ణ ప్రాంతాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పెంచేందుకు రాష్ర్ట ప్రభుత్వం ప్రతి పాదన సిద్ధం చేసింది. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా నుంచి రైతుల వివరాలు, సహకార సంఘాల ద్వారా అందిస్తున్న సేవలను నివేదిక రూపంలో జిల్లా అధికారు లు ప్రభుత్వానికి అందజేశారు.

జిల్లాలో 87,197 మంది రైతుల సభ్యత్వంతో 21 ప్రాథమిక సహకార సంఘాలు కొన సాగుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ర్టం ఏర్పాటులో భాగంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అం దుబాటులో ఉండాలనే  లక్ష్యంతో జిల్లా లు, మండలాలు, రెవెన్యూ డివిజన్లను ప్రభు త్వం ఏర్పాటు చేసింది. కానీ రైతులకు సేవలం దించే సహకార సంఘాలను మాత్రం ఏర్పాటు చేయ లేదు.

నూతనంగా ఏర్పడిన మండలాలకు ప్రాథమిక సహ కార సంఘాలను ఏర్పాటు చేయాలని ఇటీవలే రాష్ర్ట ప్రభుత్వం జిల్లాల నుంచి వివరాలను కోరింది. సిద్దిపేట జిల్లా కోపరేటివ్ సహకార సంఘం శాఖ నుంచి సేకరించిన వివరాలతో 16 కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించారు.

పీఏసీఎస్ సేవలు..

పురుగుల మందులు, విత్తనాలు, ఎరువులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, పెట్రోల్ బంకులు, గోదా ములు వంటీ సేవలతో పాటు రైతులకు లాంగ్ టర్మ్ ,షార్ట్ టర్మ్ పంట రుణాలు అందిస్తున్నారు. జిల్లాలో 16 ప్రాథమి క సహకార సంఘాలు ప్రారంభమైతే వాటి ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందుతాయి.  

ప్రతిపాదించిన సహకార సంఘాలు ఇవే..

సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, గుర్రాలగుంది, బెజ్జంకి మండలం (బేగంపేట), అక్కన్నపేట, రాయపోలు, చిన్నకోడూరు మండలంలో (చిన్నకోడూరు, ఇబ్రహీం నగర్), అక్బర్ పేట భూంపల్లి, దూల్మిట్ట, మర్కుక్, కుకునూరు పల్లి, హుస్నాబాద్ (రామవరం), గజ్వేల్ మండలం (పిడిచెడ్), నంగునూరు మండలం (నర్మేట), కొమురవెల్లి కేంద్రాలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ప్రారంభించనున్నారు.

ఇప్పటికే 21 సంఘాలు ఉండగా నూతనంగా ఏర్పాటు కానున్న సంఘాలతో కలిపి జిల్లాలో 37 పిఎసిఎస్ లు కానున్నాయి. త్వరలోనే ఈ సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. దాంతో రైతుల నమోదు ప్రక్రియ ప్రారంభించారు.

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు కూడా జరగనున్నాయి.  దాంతో గ్రామీణ స్థాయిలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. 

16 సంఘాలకు ప్రతిపాదన..

సిద్దిపేట జిల్లా నుంచి రైతుల వివిధ రాజకీయ పార్టీల, స్థానిక ఎమ్మెల్యేల ప్రతిపాదన మేరకు జిల్లా వ్యాప్తంగా 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని రాష్ర్ట ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాము.

ప్రభుత్వం ఆమోదిం చగానే కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభి స్తాం. ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాం టి సూచనలు రాలేవు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయితే జిల్లాలో మొత్తం 37 సంఘాలకు ఎన్నికలు జరుగుతాయి.

 అజ్మీరా నాగేశ్వరరావు, సహకార సంఘం జిల్లా అధికారి