ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు మరిన్ని ‘ప్లగ్ అండ్ ప్లే కో-వర్కింగ్ డెస్క్‌లు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, ఆయా కంపెనీలు చొరవ తీసుకుని వాటి ఏర్పాటుకు కృషి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని ఎంపీఎం గ్రాండ్ కాంప్లెక్స్‌లో సోమవారం ఆయన 400 సీట్ల సామర్థ్యం ఉన్న కో-వర్కింగ్ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.
కేంద్ర ఏర్పాటు చేసిన వ్యాపారవేత్త గిరీశ్ మల్సానీకి అభినందనలు తెలుపుతున్నామన్నారు. గతంలో ఇదే సంస్థ గచ్చిబౌలిలో మొదటి కో-వర్కింగ్ డెస్క్ ఏర్పాటు చేసిందని కొనియా డారు. నగరానికి అన్ని వైపులా ఇలాంటి కేంద్రాలు అందుబాటులోకి వస్తే, నగరంలో ట్రాఫిక్ సమస్య కొంత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.