- నేటి తరానికి చరిత్రను కళ్లముందు పెట్టాలి..
- పుస్తకావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): ముల్కీ- నాన్ ముల్కీ, తొలి దశ నుంచి మలి దశ ఉద్యమాల వరకు జరిగిన పరిణామాలపై మరిన్ని పుస్తకాలు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మంగళవారం ఆయన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రచించిన ‘నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
ఉద్యమకా లన్నాంతా ఒక పుస్తకంలో నిక్షిప్తం చేస్తే బాగుంటుందన్నారు. భవిష్యత్ తరాలకు తెలంగాణ ఉద్యమ పరిణామ క్రమాలను వివరించేందుకు రచయితలు విరివిగా పుస్తకాలు రాయా లని పిలుపునిచ్చారు. సిద్ధాంతాలు ఎంతోమం ది చెప్తారని, కానీ, వాటిని పాటించే వ్యక్తులు కొద్దిమందే ఉంటారని, అలాంటి వారిలో రచయిత యాదవరెడ్డి ఒకరని కొనియాడారు.
సురవరం సుధాకర్‌రెడ్డి హార్డ్‌కోర్ కమ్యూనిస్టు అయితే, జైపాల్‌రెడ్డి, యాదవరెడ్డి సాఫ్ట్‌కోర్ కమ్యూనిస్టులని సీఎం చమత్కరించారు. నాడు తెలంగాణ బిల్లును కేంద్రంతో ఆమోదింపజేయడంలో జైపాల్‌రెడ్డితో పాటు యాదవరెడ్డి ముఖ్యపాత్ర పోషించారని గుర్తుచేశారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి సీఎం మాట్లాడుతూ.. మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండకు కారణం అక్కడి అధునాతన ఆయుధాలేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖనిజ సంపదను దోచుకోవడానికే కార్పోరేట్ సంస్థలు మణిపూర్‌లో అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు.
‘భారత బలగాలు మణిపూర్‌లో శాంతి ని నెలకొల్పలేవా ? తలుచుకుంటే అక్కడి ఆయుధా లను సీజ్ చేయలేవా..?’ సీఎం ప్రశ్నించారు. చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగాలని, వాటిని నియంత్రించాలని, అప్పుడే దేశంలో శాంతి పరిఢవిల్లుతుందన్నారు.
కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, కూనంనేని సాం బశివరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పాల్గొన్నారు.