విజయవంతంగా రెండు శస్త్ర చికిత్సలు జరిపామన్న డైరెక్టర్ జైసింగ్ రాథోడ్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్సలు నిర్వహిస్తూ పేదవారికి మెరుగైన వైద్యాన్ని అందించడం జరుగుతుందని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రామోజీవార్ సంతోష్ గత సంవత్సరము నుండి నడవడము, కూర్చొని లేవడములో ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తికి రిమ్స్ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి న్యూరో సర్జరీ ప్రత్యేక వైద్య నిపుణుడు విజయ్ మోహన్ రాజు రిమ్స్ ఆసుపత్రిలోనే అత్యాధునిక వైద్య పరికరాలతో గత నెల 26న సర్జరీని విజయవంతంగా చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా నైతం లక్ష్మి బాయికి తలకు దెబ్బ తలగడంతో కుటుంబ సభ్యులు అత్యవసరంగా రిమ్స్ కు తీసుకొచ్చారు. ఆమెకి సైతం అత్యవసరంగ న్యూరో సర్జరీ ప్రత్యేక వైద్య నిపుణుడు విజయ్ మోహన్ రాజు సర్జరీ చేయడంతో పూర్తిగా కోలుకోవడము జరిగిందన్నారు. శస్త్ర చిక్కిత్స లను రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేయడం చాలా ఆనందముగా ఉందని అన్నారు.