03-04-2025 12:51:46 AM
రూ.33. 50 లక్షలకు దక్కించుకున్న బానోత్ రవీందర్
బూర్గంపాడు,ఏప్రిల్ 02(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర్ సంత వేలంపాట బుధవారం డిఎల్పిఓ సుధీర్ ఆధ్వర్యం లో గ్రామపంచాయతీ కార్యాలయంలో ని ర్వహించారు. పశువులు, కూరగాయల సంత వేలాన్ని బానోత్ రవీందర్ రూ.33.50 లక్షలకుకి దక్కించుకోగా,బందెల దొడ్డి వేలాన్ని పోడియం వేణు రూ.3,500 దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రె టరీలు భవాని,విజయ్,వెంకటేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.