calender_icon.png 1 October, 2024 | 2:30 AM

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం మూసీ

01-10-2024 12:54:07 AM

  1. వచ్చే ఎన్నికల్లో ఇది కాంగ్రెస్‌కు రిజర్వ్ బ్యాంక్ 
  2. నమామీ గంగేకు 40 వేల కోట్లు.. మూసీకి లక్షా 50 వేల కోట్లా? 
  3. మూసీ బాధితుల పాలిట కాలయముడిలా రేవంత్ 
  4. బాధిత ప్రజలకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో దేశంలో అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ సర్కార్ తెరతీసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విరుచుకుపడ్డారు. మూసీ బాధితుల పాలిట రేవంత్‌రెడ్డి కాలయముడిగా  మారారని అన్నారు.

ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు.. ఇందిరమ్మ చెప్పిందో, ఈ సోనియమ్మ చెప్పి ందో పేదల ఇల్లు కూల్చమని అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లా డుతూ.. రాష్ర్టంలో నడుస్తున్న బుల్డోజర్ అరాచకాలను పరిగణలోకి తీసుకొని చట్టప్రకారం వెళ్లమని సూచించిన న్యాయస్థానానికి పేదలందరి తరఫున ధన్యవాదాలు తెలిపారు.

ఖజనా ఖాళీ అయ్యిందని, అప్పుల కోసమే వడ్డీలు కడుతున్నట్టు పదే పదే పేర్కొంటున్న సర్కార్ పెద్దలు.. లక్షన్నర కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టుకున్నారని మండిపడ్డారు. 1994లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు వచ్చాయని ప్రజలు చెప్తున్నారని, నాడు రిజిస్ట్రేషన్లు, కరెంట్, వాటర్ బిల్లులు తీసుకున్నప్పుడు లేని అభ్యంతరం.. ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు.

అప్పర్ మానేర్, మిడ్ మానేరు ప్రాజెక్టులతో తమ కుటుంబం రెండుసార్లు నిర్వాసితులుగా మారిందని, ఆ ఇంటితో ఉండే అనుబంధం ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. ప్రజలు మీ మాదిరిగా అయాచితంగా లక్కీ డ్రాలో వచ్చినట్టు ఎదగలేదని, గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చట్టబద్ధంగా అన్ని అనుమతులు వారికి ఉన్నాయని రేవంత్‌ను ఉద్దే శించి అన్నారు.

దమ్ముంటే ఆ ఇండ్లకు అనుమతులు ఇచ్చిన వారు, వాటిని ప్రోత్స హించిన వారిపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. 2400 కిలోమీటర్ల నమా మీ గంగా ప్రక్షాళన కోసం రూ.40 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు రూ.లక్షా 50 వేల కోట్ల ఖర్చు వెనుక ఉన్న మతలబు ఏమిటని ప్రశ్నించారు. 

ఢిల్లీ పార్టీలను గెలిపిస్తే గల్లీల్లో ఆక్రందనలే

నాలాల మీద కట్టిన నిర్మాణాలను కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా, జీహెఎంసీ బిల్డింగ్‌లను నేటమట్టం చేయాలని కేటీఆర్ స్పష్టంచేశారు.  కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే భావనతో ఎఫ్‌టీఎల్‌లో ఉందని సచివాలయాన్ని కూడా కూలగొడుతాడేమోననే రేవంత్‌రెడ్డిపై అనుమానం కలుగు తుందని అన్నారు.

మూసీ బాధితులు ఆక్రందనలు చేస్తుంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎక్కడున్నారని నిలదీశారు. ఢిల్లీ పార్టీలను ఎప్పుడు గెలిపించిన సరే గల్లీల్లో ప్రజల ఆక్రందనలు ఇలాగే ఉంటాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో దేశంలోనే వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ అయ్యిందని.. మూసీ ప్రాజెక్ట్‌తో మురిసే రైతులెంత మంది అని ప్రశ్నించారు.

ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వని ప్రాజెక్టుకు రూ.లక్షా 50 వేల కోట్లా ఖర్చు ఎందుకు? అని అడిగారు. మూసీ ప్రాజెక్ట్‌కు లక్షా 50 వేల కోట్లంటే అది కాంగ్రెస్‌కు రిజర్వ్ బ్యాంక్ లాంటిదేనన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎవరికీ ప్రయోజనం, దీని కోసం రేవంత్ రెడ్డిని ఎవరు ఒత్తిడి చేస్తున్నారని ప్రశ్నించారు.

పేదల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తాం

హైకోర్టు స్పష్టంగా ప్రభుత్వాన్ని ఆక్షేపించిందని, అవసరమైతే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని కేటీఆర్ అన్నారు. పేదవాళ్లతో పెట్టుకోవటం మంచిది కాదని కాంగ్రెస్ నాయకులు రేవంత్‌రెడ్డికి చెప్పాలని, సంగారెడ్డిలో కూల్చివేతలు చేస్తే ఒక వ్యక్తికి తీవ్ర గాయమైందని, అసలు వీళ్లకు ప్లాన్ లేదు ప్రణాళిక లేదని మండిపడ్డారు.

తాము పేదల కడపు కొట్టకుండా నాగోల్ వద్ద మూసీ సుందరీకరణ చేశామని, మూసీ మీద చాలా బ్రిడ్జిలను మంజూరు చేసినట్టు గుర్తుచేశారు. సీఎం రేవంత్‌ది, అతని సోదరుని ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయని.. రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే ముందు మీ ఇల్లు కూలగొట్టాలని డిమాండ్ చేశారు.

ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న మీ మంత్రు లు, ఎమ్మెల్యేల ఇళ్లు మొదట కూల్చివేయాలని, ఆ తర్వాత పేదల మీదికి రావాలని సూచించారు. హైడ్రాను అడ్డుకుంటే హైదరాబాద్ మునిగిపోతుందని కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతున్నారని.. వీళ్లు రాకముందు హైదరాబాద్ లేదన్నట్టు ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు.

50 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లు కూల్చుతామంటే మీ అయ్య జాగీరు కాదని, మూసీ బాధితులకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో తిరుగుతామని స్పష్టంచేశారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా.. కాంగ్రెస్ ఎంపీల కన్నా బీజేపీ ఎంపీలే కాంగ్రెస్‌కు చెక్క భజన చేస్తున్నారని విమర్శించారు. 

నిధులు లేక పల్లెలు నీరసంతో తల్లడిల్లుతున్నాయి

సీఎం రేవంత్‌కు ఢిల్లీ విమానం ఎక్కడం, దిగడంతోనే సరిపోతుందని.. ప్రజల సమస్యలు ఆలోచించే తీరిక ఎప్పుడు ఉంటుం దని కేటీఆర్ విమర్శించారు. సోమవారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ.. పల్లెలు నిధులు లేక నీరసంతో తల్లడిల్లిపోతున్నాయని అన్నా రు. ఫైనాన్స్ కమిషన్ ఫండ్ కూడా విడుదల చేయకుండా గ్రామాలను గబ్బుపట్టిస్తున్నారని మండిపడ్డారు.

పంచాయతీల్లో పాలన గాడి తప్పిందని, పారిశుద్ద్యం పడకేసిందని, ప్రజలు రోగాల పాలైతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్లకు డీజిల్ లేదు, కార్మికులు వేతనాలు లేవు, ఎనిమిది నెలలుగా అంతా అస్తవ్యస్థంగా మారిందని విమర్శించారు. నిన్న ప్రగతి మల్లెలై విరిసిన పల్లెలకు నేడు పైసలు గతిలేని పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. 

పక్క రాష్ట్రంలో పింఛన్ పెంపు.. తెలంగాణలో ఎప్పుడు?

పక్క రాష్ర్టంలో పింఛన్ పెంచారని, మరి మన రాష్ట్రంలో ఎందుకు పెంచ టం లేదని కేటీఆర్ అన్నారు. ఇప్పటి వరకు రైతుబంధు జాడ లేదని, ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి మీడియాకు మొఖం చాటేశాడని, అధికారులను ముందు పెట్టారని మండిపడ్డారు.

ఇళ్లు కూల్చుతుంటే చిన్న పిల్లలు రోడ్డెక్కి ఏడుస్తుంటే, వాళ్లు పైసల కోసమే ఏడుస్తూ, తిడుతున్నారంటూ ఓ మంత్రి అంటున్నాడని, మీ మంత్రులు ఒక్కో కుంభ కోణాన్ని పంచుకున్నట్టు అనుకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతా అంటే తెలంగాణ ప్రజలు తిరగబడుతారని హెచ్చరించారు.

సావా స దోషంతో శ్రీధర్‌బాబు కూడా సీఎం మాదిరిగా చెడిపోయాడని విమర్శించారు. చిన్న పిల్లల ఆవేదన హైకోర్టుకు అర్థమైందని, కాంగ్రెస్ నాయకులకు అర్థం కావటం లేదని అన్నారు. నిర్వాసితులు రేవంత్‌రెడ్డిని తిట్టిన తిట్లు చూస్తుంటే తనకే బాధేసిందని అన్నారు. ప్రజలకు అన్యాయం చేస్తామంటే తాము చూస్తూ ఊరుకోబోమని, బుల్డోజర్లు వస్తే వాటికి అడ్డుగా నిలబడుతా మని స్పష్టంచేశారు.