calender_icon.png 26 December, 2024 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబిలమ్మలా మెరిసిపోతూ..

01-08-2024 12:05:00 AM

ఆకాశ వీధి నుంచి దిగివచ్చిన జాబిలమ్మలా మెరిసిపోతూ, చూపు తిప్పుకోవటం కష్టం అనేంతగా గ్లామర్ లుక్‌తో కట్టి పడేస్తోంది కదూ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్న భామ! ఇందులో ఉన్నది ‘గేమ్ చేంజర్’ చిత్రంలో రామ్‌చరణ్ సరసన నటిస్తున్న కియారా అద్వానీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ‘వినయ విధేయ రామ’లోనూ రామ్‌చరణ్‌తో జతకట్టిన ఈ అమ్మడు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈ ‘గేమ్ చేంజర్’ హీరోయిన్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆ మూవీ టీమ్ కియారాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బుధవారం సినిమాలోని ఆమె లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

‘జాబిలమ్మకు జన్మదిన శుభాకాంక్షలు’ అన్న క్యాప్షన్‌తో మేకర్స్ సోషల్ మీడియాలో వదిలిన ఈ పోస్టర్‌ను నెటిజన్లు తమ మునివేళ్లతో ఒక్కసారైనా తడమకుండా ఉండలేకపోతున్నారంటే నమ్మండి. ఇటీవలే రామ్‌చరణ్ పాత్రకు సంబంధించి చిత్రీకరణ పూర్తయింది. మిగతా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉంది చిత్రబృందం. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.