విజయనగరం జిల్లాలో దారుణం.. నిందితుల అరెస్ట్
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి) : ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ఆరు నెలల చిన్నారిపై అత్యాచారం చేశాడో కామాంధుడు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలా నికి చెందిన ఓ మహిళ తన ఆరు నెలల కూతురుని ఊయలలో పడుకోబెట్టి సమీపంలోని కిరాణ దుకాణానికి వెళ్ళింది. ఇది గమనించిన నార్లవలస గ్రామానికి చెందిన ఎరకన్న దొర ఇంట్లోకి చొరబడి ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ పాప గట్టిగా ఏడ్చింది. చిన్నారి కేకలు విన్న తన తల్లి ఇంటికి వెళ్లేలోపు ఎరకన్న దొర అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం చిన్నారిని బాడం గి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తు తం చిన్నారి క్షేమంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు స్వయంగా గ్రామానికి వెళ్ళి స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. అనంతరం నార్ల వలసకు వెళ్ళి నిందితుడిని అరెస్టు చేశారు.