- ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటన
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం
- గ్రామీణ ఉపాధి హామీ పనుల బిల్లులు వెంటనే చెల్లించాలని ఆదేశం
హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం ఉద్యోగుల తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులందరికీ జీతాల చెల్లింపులో ఆలస్యం కాకుండా.. స్పష్టమైన విధానం అనుసరించాలని పంచాయతీరాజ్, ఆర్థిక శాఖల అధికారుల ను ముఖ్యమంత్రి సూచించారు.
గ్రీన్ చానెల్లో వీరికి జీతాలు చెల్లించాలని స్పష్టంగా చెప్పారు. గురువారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 92351 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరికి ప్రతి నెలా రూ. 116 కోట్లు జీతాలుగా చెల్లించాల్సి ఉం టుందని పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని, వీటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రాబట్టుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.
ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.