26-03-2025 01:19:18 AM
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైమ్, మార్చి 25 (విజయ క్రాంతి) : డివిజన్ ల వారీగా ఏసీపీలు డివిజన్ స్థాయిలో ప్రతినెల నేర సమీక్షలు నిర్వహించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. మంగళవారం హుజురాబాద్ సబ్ డివిజన్ ఏసీపీకార్యాలయంలో కమిషనర్ డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీసు కమీషనర్ మాట్లాడుతూ పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టం ను సరైన పద్దతిలో అవలంభించాలన్నారు.
స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్లు వారి వారి పరిధిలోని పోలీసు స్టేషన్లను తరుచూ సందర్శిస్తూ వారి పనితీరును పర్యవేక్షించాలన్నారు. సీసీసీ ద్వారా వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యత కల్పించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఆకస్మాత్తుగా తలెత్తే శాంతి భద్రతల సమస్యలను పరిష్కరించేందుకు సరైన లాఠీ , హెల్మెట్ మొదలగు వాటిని ఎల్లపుడు కలిగి వుండి సంసిద్ధంగా వుండలన్నారు.
రానున్న రోజుల్లో వచ్చే పండుగలైన రంజాన్ , శ్రీరామనవమి మరియు హనుమాన్ జయంతి దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తుతో పాటు తగిన భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో హుజురాబాద్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు రవి, కిషోర్, వెంకట్, సంతోష్ కుమార్, రమేష్, సరిలాల్, డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల ఎస్త్స్ర లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.