04-04-2025 05:46:47 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కోతుల బెడద తీవ్రంగా ఉన్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా కోతుల పట్టివేత మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంకీ క్యాచర్స్ సిబ్బంది కోతులను పట్టుకొని నిర్మల్ అటవిశాఖ అధికారులకు అప్పగిస్తామని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ విలేకరులకు తెలిపారు. పట్టివేత శుక్రవారం నుంచి ప్రారంభించామని త్వరలోనే పట్టణంలో అన్ని కాలనీలో పట్టివేస్తామని ఆయన తెలిపారు. ఆయనతో పాటు మున్సిపల్ సిబ్బంది పలువురు ఉన్నారు.