calender_icon.png 25 October, 2024 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో ఇక కోతులు మాయం..

25-10-2024 12:04:38 PM

మంథని నుంచి జన్నారంకు కోతుల తరలింపు...

మంత్రి సహకారంతో కోతులతో కష్టాలకు చెక్...

మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి

మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలో ఇక కోతులు మాయం అవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా మంథని పట్టణంలో కోతుల బెడద ఎక్కువై పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతుల గుంపు ఏకంగా ఇండ్లపైకే వస్తూ ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేస్తున్నాయి. బస్టాండ్ సమీపంలో పండ్లు అమ్ముకునే వారు కోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కోతుల నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ వ్యాపారులు, ప్రజలు, మున్సిపల్ చైర్ పర్సన్ రామదేవి దృష్టికి తీసుకువెళ్లగా, స్పందించిన ఆమె కోతులను పట్టే వారిని పిలిపించి వాటికి ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేసి, ఒక్కొక్క కోతికి రూ. 300 రూపాయలు చెల్లించి కోతులను పట్టుకుంటున్నారు. పట్టుకున్న కోతులను చాలా సురక్షితంగా మంథని నుంచి  జన్నారంకు  తరలిస్తున్నారు. దీంతో మంథనిలో ఇక కోతుల కష్టాలు తగ్గనున్నాయి. మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి మాట్లాడుతూ.. కోతులతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తెలుపడంతో మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి కోతులు పట్టే వారిని పిలిపించి, మున్సిపల్ సిబ్బంది, ప్రజల సహకారంతో మంథనిలో కోతుల లేకుండా చెక్ పెడుతున్నమన్నారు.