కరోనా తర్వాత కాస్తంత అదే స్థాయిలో హల్‌చల్ చేస్తున్న వైరస్ ‘మంకీపాక్స్’. ఇది అప్పుడెప్పుడో మూడు నాలుగు తరాల ముందు జనాన్ని భయబ్రాంతుల్ని చేసిన మశూచీ (స్మాల్ పాక్స్)కు కుటుంబానికి చెందింది. కోవిడ్ తర్వాత ప్రపంచాన్ని అదే స్థాయిలో గడగడలాడిస్తుందన్న వార్తల నేపథ్యంలో దీని గురించి అవగహన కోసం ఈ కథనం..
మంకీపాక్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. ఈ వైరస్ చాపకింద నీరులా మ్యుటేషన్స్ చెందుతున్నది. మంకీపాక్స్ అని పిలిచే ఈ వైరస్‌ను 1950 చివరలో కనుగొన్నారు. కానీ గడిచిన మూడు నాలుగేళ్లలో ఈ వైరస్ మ్యుటే ట్ అయినట్లు సంకేతాలు ఉన్నాయి. జంతువుల నుం చి మనుషులకు సంక్రమించే వ్యాధులను జోనోటిక్ వ్యాధులంటారు. వీటిల్లో కొన్ని మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆ క్రమంలో ఎంపాక్స్‌కు కోవిడ్ దగ్గరి పోలికలు ఉన్నాయి.
మంకీపాక్స్ వైరస్ అంటే ఏమిటి?
ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. మనుషుల్లోకి చేరిన తర్వాత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ను తొలిసారిగా 1958లో గు ర్తించారు. దీని కేసులు చాలావరకు మధ్య, పశ్చిమ ఆ సియాలో కనుగొన్నారు. ఎందుకంటే.. అక్కడ మనుషులు జంతువులకు చాలా దగ్గరగా జీవిస్తారు.
వ్యాధి లక్షణాలు?
ఈ వైరస్ సోకినప్పుడు మొదట్లో జ్వరం వస్తుంది. ఆ తర్వాత శరీరం అంతటా దద్దుర్లు వస్తాయి. ఈ ద ద్దుర్లు ముఖం, జననేంద్రియాలపై పుట్టుకువస్తాయి. అవి చీముతో నిండిన తెలుపు, పసుపు రూపంలో ఉంటాయి. ఇవి.. దురద, నొప్పిని కలిగిస్తాయి. అంతే కాకుండా.. జ్వరం, తలనొప్పి.. కండరాల నొప్పి ఉం టుంది.
ఎలా నయం అవుతుంది?
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం.. ఈ వైరస్ సోకిన తర్వాత 21 రోజుల వరకు లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ 14 రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత.. అదే స్వయంగా నయం అవుతుంది. ఈ వ్యాధికి టీకా కూడా అందుబాటులో ఉంది.
వైరస్ వ్యాప్తికి కారణం?
మంకీపాక్స్ సోకిన వ్యక్తితో పరిచయం ద్వారా వ్యాపిస్తుంది. లైంగిక సంబంధాలు కారణంగా సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ కళ్లు, శ్వాస, ముక్కు, నోటి ద్వారా ప్రవేశిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు తాకిన పరుపులు, వస్త్రాలు మొదలైన వాటి ద్వారా వ్యాపిస్తుంది. ఇది కాకుండా.. ఈ వైరస్ ఎలుక, ఉడుత, కోతులతో కూడా సంక్రమిస్తుంది.
ఈ వైరస్ ప్రమాదమెంత?
ప్రస్తుతం ఎంపాక్స్ వైరస్ స్ట్రెయిన్ వల్ల సంభవించే మరణాల రేటు ఒక శాతంగా ఉంది. మంకీపాక్స్ సోకిన వ్యక్తులు బలహీనపడటమే కాక, తీవ్రమైన బాధకు గురవుతారు. రోగిలో ఫ్లూలాంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, తలనొప్పి కనిపిస్తాయి. కానీ వ్యాధి ముదురుతున్న కొద్దీ నోరు, పాదాలు, జననేంద్రియాల వద్ద చీముతో నిండిన బొబ్బలు అభివృద్ధి చెందుతాయి. ఈ వైరస్ ఐదు నుంచి 21 రోజుల సమయం పడుతుంది.
జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట ఉంటుంది. ఈ వైరస్‌లో బాగా స్పష్టంగా కనిపించే ఓ లక్షణం లింఫు గ్రంథుల వాపు. జ్వరం కనిపించిన కొన్ని రోజులకే శరీరంపై పగుళ్లు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన మూడు నుంచి నాలుగు వారాల తర్వాత బొబ్బలు అణిగిపోయి రాలిపోతాయి. వ్యాధి నుంచి బయపడినా భయం మాత్రం పోదు. ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ లేదు. కేవలం లక్షణాలు తగ్గేందుకు మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
నివారణ చర్యలు?
- వైరస్ సోకి బాధపడుతున్న రోగిని ఐసోలేట్ చేయాలి. ఇంట్లోని కుటుంబసభ్యులు బాధితుల నుంచి కొద్దిరోజుల పాటు దూరంగా మెలగాలి.
- పెంపుడు జంతువులను గానీ లేదా బాధితుడిని గాని తాకినట్లు అనుమానం వస్తే సబ్బుతో గానీ లేదా ఆల్కహాల్ బేస్‌డ్ శానిటైజర్‌తో గానీ చేతులు శుభ్రం చేసుకోవాలి.
- బాధితులకు దగ్గరగా వెళ్ళాల్సిన అవసరం ఉన్నవారు పీపీఈ కిట్లు ధరించాలి. అంటే మంకీపాక్స్ విషయంలోనూ ఇంచుమించు కరోనా వైరస్‌కు సంబంధించిన జాగ్రత్తలే తీసుకోవాలి. ఇక్కడ కూడా అవే బాగా పనికి వస్తాయి.
కోవిడ్ లాగే మరో మహమ్మారిగా మారే ప్రమాదం ఉందా?
ఇప్పటికిప్పుడైతే అలా మారే అవకాశం లేదు. వ్యాధి సోకిన తర్వాత ఒంటిపై మచ్చలు చాలాకాలం ఉండిపోయినప్పటికీ చాలావరకు ఇది తనంతట తానే తగ్గిపోయే వ్యాధి (సెల్ప్ లిమిటింగ్ డిసీజ్) కావడంతో దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది నిపుణుల భావన. అందుకే దీని కారణంగా పెద్ద ఎత్తున లాక్‌డౌన్‌లూ, ఇతరత్రా ఆంక్షలు అవసరం లేనప్పటికీ.. ఇది వ్యాప్తి చెందుతున్న తీరుగా జాగ్రత్తగా గమనిస్తూ.. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.
డాక్టర్ పి.కిరణ్మయి
ఎంబీబీఎస్, డీఎన్‌బీ
(జనరల్ మెడిసిన్)
సీనియర్ కన్సల్టెన్సీ ఫిజిషియన్,
మెడికవర్ హాస్పిటల్, చందానగర్