calender_icon.png 30 April, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డిలో కోతుల బెడద!

29-04-2025 01:23:41 AM

  1. కాలనీల్లో గుంపులుగా సంచారం

నివాసాల్లోకి చొరబడి దాడులు

ఇటీవల చిన్నారిపై దాడి చేసిన మంద 

అధికారులు పట్టించుకోవాలని స్థానికుల విజ్ఞప్తి

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 28: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో కోతుల బెడద అధికంగా మొదలయ్యింది. పట్టణంలోని పలు వార్డుల్లో కోతులు గుంపులు గుంపులుగా వస్తు నివాసలలోకి దూసుకొస్తూ మహిళలపై చిన్నారులపై దాడులు చేస్తూ కరుస్తు న్నాయి. ఎన్నోసార్లు అధికారులకు ప్రజలు మొరాయించుకున్న ఫలితం శూన్యం అవుతుంది. కోతులతో పాటు అధికంగా గుంపులు గుంపులుగా కాలనీలో కుక్కలు కూడా చేరడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మున్సిపల్ పట్టణంతోపాటు పలు గ్రామాలలో కూడా, కుక్కలు, కోతులు స్వురై విహా రం చేస్తున్నాయి. కుక్కలు చిన్న పిల్లలనే కాదు, పెద్దలనూ వెంటపడి కరు స్తున్నాయి. కోతులు గుంపులు, గుంపులుగా తిరుగుతూ, ఇళ్లల్లోకి చొరబడు తున్నాయి. తిండి కోసం ఇల్లంతా చిందర వందర చేస్తున్నాయి. మహిళలు, పిల్లలపై దాడులు చేస్తున్నాయి. పెద్దవాళ్లు కర్రలతో బెదిరిస్తున్నా జంకడం లేదు. మందలుగా మనుషుల మీదకు దూకుతున్నాయి.

ఇదివరకు బాణా సంచా కాల్చగానే భయపడి పారిపోయేవి. ఇప్పుడు వాటికీ బెదర టం లేదు. ఇళ్ల ముందు పూలకుండీలు, విద్యుత్‌దీపాలు, విలువైన వస్తువులను పగు ల గొడుతున్నాయి. కోతుల బాధలు పడలేక తలుపులు వేసుకోవాల్సి వస్తోం దని ప్రజలు వాపోతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఒకటో వార్డు రెండో వార్డు బస్టాండు వైపున కోతులు గుంపులు గుంపులుగా వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

నలుగురైదుగురు కలిసి శబ్ధాలు చేస్తూ, కర్రలతో అదిలిస్తున్నప్పటికీ కోతు లు పారిపోవటం లేదని, ఎదురుతిరిగి దాడి చేస్తున్నాయని, కాలనీవాసులు ప్రజలు, చెబు తున్నారు. మున్సిపల్ పట్టణంలో, మున్సిపల్ అధికారులు, చర్యలు చేపట్టి మున్సిపల్ పట్టణ ప్రజలను కాపాడాలని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎల్లారెడ్డి పట్టణంలోని ఓ కాలనీలో ఇంట్లోకి చేరి రెండు సంవత్సరాల పాపపై కోతులు దారుణంగా దాడి చేయడంతో ఆ పాపకు తీవ్ర అవస్థలు ఎదురయ్యాయి. చికిత్స నిమిత్తం పాపను ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకా కోతులు ఎంతమందిని కరుస్తాయోనని కాలనీవాసులు పట్టణ ప్రజలు భయాందోళనతో  వనికి పోతున్నారు.

కనుక మున్సిపల్ శాఖ అధికారులు ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం కోతుల నుంచి వారిని కాపాడి కోతులను పట్టణంలో నుంచి తరిమే విధానానికి చర్యలు చేపట్టాలని ఎల్లారెడ్డి పట్టణ ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.