పోలీసుల అరెస్టు, రిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): చిట్టీల పేరు తో అమాయకులను నమ్మించి రూ.2.98 కోట్లతో పరారైన నిందితుడిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీ సులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈవోడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు అప్పంపల్లి సూర్య ప్రతాప్‌రెడ్డి 14 సంవత్సరాలుగా చందానగర్‌లో నివాసముంటూ చిట్టీ వ్యాపారం నిర్వహి స్తున్నాడు.
ఈ క్రమంలో చందానగర్‌తో పాటు మియాపూర్, కూకట్‌పల్లి, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లోని పరిచయస్తులతో ఇటీవల రూ.లక్ష నుంచి రూ.25 లక్షల వరకు చిట్టీలు వేయించాడు. ఇలా సుమారు 80 మంది నుంచి రూ.2.79 కోట్లు వసూలు చేసి ఇటీవల పరారయ్యాడు.
ఈ విషయమై బాధితుడు చందానగర్‌కు చెందిన నసర్ ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు మంగళవారం కర్మన్‌ఘాట్ ప్రాంతంలో నిందితుడు సూర్య ప్రతాప్‌ను అరెస్ట్ చేశారు.