calender_icon.png 20 January, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరియా నుంచి విమానాల్లో రష్యాకు సొమ్ము

17-12-2024 12:44:27 AM

బషర్ అల్‌అసద్ పాలనలో భారీగా తరలింపు

డమాకస్, డిసెంబర్ 16: సిరి యా దివంగత అధ్యక్షుడు బషర్ అల్‌అసద్ దేశంలో నెలకొన్న అంతర్యుద్ధ పరిస్థితులను ఆసరా చేసుకు ని రష్యాకు భారీగా సొమ్ము తరలించినట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ అనే ఆంగ్ల పత్రిక తాజాగా కథనాలు రాసుకొస్తున్నది. బషర్ 2018 19 మధ్య సుమారు రెండు టన్నుల 100 డాలర్ల బిల్లులు, 500 యూరోల కరెన్సీని విమానాల్లో కుక్కి రష్యాకు చేరవేశారని, వాటి విలువ సుమారు 250 మిలియన్ డాలర్లని కథనాల సారాంశం.

అలా తరలిన సొమ్ము మాస్కోలోని వ్యూంకోవ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరేదని, అక్కడి నుంచి పలు రష్యన్ బ్యాంక్ లో నగదు జమయ్యేది.  బదులుగా రష్యా నుంచి సిరియాకు ఆర్థిక, సైనికపరమైన సాయం అందేది. సిరి యాపై అంతర్జాతీయంగా ఆర్థికపరమైన ఆంక్షలు ఉండడంతోనే బషర్ అల్‌అసద్ అడ్డదారి ఎంచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.