calender_icon.png 23 April, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేటర్ల అనుచరుల కాసుల వేట!

23-04-2025 12:36:05 AM

  1. అడ్డూ అదుపూ లేని వసూళ్ల దందా 
  2. డివిజన్లలో నిర్మాణాలపై నిరంతరం నిఘా 
  3. నిర్మాణణాదారుల నుంచి డబ్బులు వసూలు 
  4. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల అనుచరుల నిర్భంధ, అక్రమ వసూళ్లు
  5. నిర్మాణాలు చేపట్టాలంటే భయపడుతున్న నిర్మాణాదారులు

ఎల్బీనగర్, ఏప్రిల్ 23 : ఎల్బీనగర్ ని యోజకవర్గంలో కార్పొరేటర్ల అనుచరుల వ సూళ్ల దందా అడ్డూ అదుపూ లేకుండా ఉన్న ది. డివిజన్ల పరిధిలో నూతన నిర్మాణాలపై నిరంతరం నిఘా పెడుతూ నిర్మాణాదారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నా రని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది చేయాల్సిన ప నులను కార్పొరేటర్ల అనుచరులు తమ చేతిలోకి తీసుకుని, అనుమతులు లేవని బెది రించి నిర్బంధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరికి తోడుగా జీహెచ్‌ఎంసీ సిబ్బం ది సైతం అనుమతులు లేవని, సరైన డాక్యుమెంట్లు లేవని నిర్మాణాదారులను బెదిరించి అందినకాడికి డబ్బులు దొచుకుంటున్నారు.

ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు తమ అనుచరులను ఏజెంట్లుగా ని యమించుకుని అక్రమ వసూళ్లకు తెరతీస్తున్నారు. జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందిపై అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో  ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఆస్తి పన్నులు వసూలు అవుతున్నాయి.

మె ట్రో రైలు మార్గంతోపాటు జాతీయ రహదా రి, ముఖ్యమైన అంతరాష్ట్ర రోడ్డు మార్గాలు ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. శివారు ప్రాంతాల్లో అనేక నూతన కాలనీలు ఏర్పడుతున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో చైతన్యపురి, కొత్తపేట, నాగోల్, మన్సూరాబాద్, హయత్ నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, చంపాపేట, లింగోజిగూడ, హస్తినాపురం, గడ్డి అన్నారం మొత్తం 11 డివిజన్లు ఉన్నాయి.

ముఖ్యంగా హస్తినాపురం, బీఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, మన్సూరాబాద్ డివిజన్లలోని శివారు ప్రాంతాల్లో అనేక నూతన కాలనీలు ఏర్పడుతున్నాయి. ఆయా డివిజన్లలో నూతన నిర్మాణాలు కొనసాగుతుం డడంతో కార్పొరేటర్లకు చేతినిండా పని దొ రుకుతుంది. కార్పొరేటర్లు నేరుగా కాకుండా తమ అనుచరులను నిర్మాణాలు జరుగుతు న్న ప్రాంతానికి పంపించి, యజమానులతో బేరసారాలు చేయించి, డబ్బులు వ సూలు చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎక్కడా పునాది తీసినా.. రాయి కట్టినా... రేకులు వేసి నా... షటర్లు కట్టినా... బహుళ అంతస్తులు కనిపించినా వెంటనే కార్పొరేటర్ల అనుచరులు వాలిపోతారు. జీహెచ్‌ఎంసీ నుంచి తీ సుకున్న సమాచారంతో నిర్మాణదారులతో బేరం మాట్లాడుతారు. మీ నిర్మాణానికి అవసరమైన అనుమతులు లేవని, సరైన డాక్యు మెంట్లు లేవని... మా అండ లేకుండా ఎలా పనులు చేయిస్తా లో చూస్తా? అని బెదిరింపులకు దిగుతారు. 

అన్న చెప్పిండు... సార్ చెప్పిండు అంటూ అడిగినంత ఇవ్వకుంటే ని ర్మాణాలను అధికారుల దృష్టికి తెచ్చి, కూల్చి వేయిస్తామని బెదిరించి అందినకాడికి తీసుకుంటారు. కష్టపడి సొంత ఇల్లు నిర్మించు కుంటే కార్పొరేటర్ల అనుచరులు బెదిరిస్తుం టే ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిర్మాణదారులు కన్నీళ్లను దిగమింగుకుంటున్నారు. ఆయా డివిజన్లలో కొత్తగా నిర్మాణాలు జరుగుతుంటే కార్పొరేటర్ల అనుచరులు వాలిపో తున్నారు.

నిర్మాణాదారులకు వీరిని ఎదిరించే ధైర్యం లేక ప్రజాప్రతినిధుల అను చరులకు చెప్పినంత ఇస్తున్నారు. బహిరంగంగా కొనసాగుతున్న వసూళ్లపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం డివిజన్లలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించినప్పుడు అనేక మంది కార్పొరేటర్ల అక్రమ వసూళ్లపై ఫిర్యాదు చేశారు.

కొత్తగా ఇండ్లు కట్టుకోలేకపోతున్నామని, అనుమతులు తీసుకున్నా... సరైన డాక్యుమెంట్లు లేవని బెదిరించి నిర్బంధంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వివరించారు. అక్రమ వసూళ్లపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అధైర్య పడకుండా నిర్మాణాలు చేసుకోవాలని, ఎవరైనా బెదిరిస్తే తనకు చెప్పాలని సూచించారు. 

బహిరంగంగా బెదిరిస్తున్నారు 

ఇటీవల ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కార్పొరేటర్ల అనుచరులు డబ్బుల కోసం తమను బెదిరిస్తున్నారని అనేక మంది తనకు ఫిర్యాదు చేశారు. పేద లు, ధనికులు అన్న తేడాలేకుండా కార్పొరేటర్ల అనుచరులు బెదిరిస్తున్నారు. చిన్న ఇల్లు నిర్మించుకున్నా... బతకడానికి చిన్న డబ్బా పెట్టుకున్నా... అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్న వారిని బెదిరించి పైసలు వసూలు చేస్తున్నా రు.

ఇలాంటి పరిస్థితులు ఎల్బీనగర్ నియోజకవర్గంలో బహిరంగంగా కొనసాగుతు న్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం మాదేనని కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ధైర్యంగా నిర్మాణాలు చేసుకోవాలి... బెదిరింపులు వస్తే తనకు చెప్పాలి. బెదిరింపులను అడ్డుకుని, ప్రజలకు అండగా ఉంటా.

దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, 

ఎల్బీనగర్ ఎమ్మెల్యే 

- మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాంసరూర్ నగర్ సర్కిల్ పరిధిలో అక్రమ వసూళ్లపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు తీసుకుంటే ఎవరికి భయపడా ల్సిన అవసరం లేదు. అన్ని అనుమతు లు తీసుకుని, నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి. భవన నిర్మాణ సమయంలో ఎవరైనా బెదిరిస్తే నేరుగా అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

 సుజాత, సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్