calender_icon.png 25 April, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయటపడుతున్న ఆర్పీల‘లీల’లు

25-04-2025 12:57:01 AM

నెహ్రూ మహిళా సంఘానికి చెందిన రూ.14 లక్షల స్వాహా చేసిన ఆర్పీ  

గతంలోనే చెప్పిన ‘విజయక్రాంతి’ 

గజ్వేల్, ఏప్రిల్ 25:  గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మెప్మా ఆర్పిల లీలలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నా యి. గజ్వేల్ మెప్మా ఆర్పీలు మహిళ సంఘాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని ఇదివరకే విజయక్రాంతి వార్త కథనాలు ప్రచురించింది. తాజాగా ఆర్పీల వసూళ్లు మరిన్ని బయటకు వస్తున్నాయి. తమకు వచ్చిన రూ.20 లక్షల రుణంలో రూ.14 లక్షలు ఆ సంఘానికి చెందిన అర్పి, మరో మహిళా సంఘం సభ్యురాలీ సహకారంతో వాడుకున్నట్లు గురువారం పట్టణానికి చెందిన  నెహ్రూ మహిళా సంఘం  సభ్యులు మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్యకు ఫిర్యాదు చేశారు.  గతంలో కొనసాగిన నెహ్రూ మహిళా సంఘం సభ్యులు అందరూ గ్రూప్ నుండి తొలగిపోగా ఒకరికొకరు పరిచయం లేని పదిమంది సభ్యులను బ్యాంకు అధికారులకు చూపి వారే నెహ్రూ సంఘం సభ్యులని నమ్మించి సంఘానికి  రూ.20 లక్షల రుణా న్ని ఆర్పి మంజూరు చేయించింది.

రుణం మంజూరుకి ముందుగానీ, తర్వాత గానీ గ్రూప్ సభ్యులు ఒకరినొకరు కలుసుకోలేదు. కొద్దిరోజుల క్రితం రుణం ఇచ్చిన బ్యాంకు అధికారులు సంఘం సభ్యులకు ఫోన్ చేసి వాయిదాల చెల్లించాలని అడిగారు. వెంటనే బ్యాంకుకు వెళ్లి అధికారులను అడుగగా, తమ పేరున రూ.20 లక్షలు రుణం మంజూరు చేసినట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. తమలో కొందరికి మా త్రమే రూ. లక్ష చొప్పున, మెప్మా సి ఓ సోదరి కి రూ. రెండు లక్షల రుణం మాత్రమే ఇవ్వడం జరిగిందని, మిగతా డబ్బుల విషయం తమకు తెలియదని అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ మెప్మా సివో సరితకు తెలుసని, తమ పేరున అధిక మొత్తంలో రుణం వచ్చినట్లు మాలో ఒకరం గు ర్తించి ప్రశ్నించగా, ప్రశ్నించిన సభ్యురాలికి మాత్రమే అసలు మొత్తాన్ని ఇచ్చారని గ్రూపు చెందిన సభ్యురాలు వెల్లడించింది.

ఒకరికొకరు తెలియని మమ్మల్ని ఒక గ్రూప్ గా చేసి రూ. 50వేలు, రూ. లక్ష చొప్పున రుణం ఇస్తామని నమ్మబలికి  తమ పేరున రూ.20 లక్షల రుణాన్ని తీసుకొని ఆర్పి తమను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి, చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం వెల్లదీస్తున్న మమ్మల్ని మోసం చేసిన ఆర్పిని ఆమెకు సహకరించిన మరో గ్రూప్ సభ్యురాలు నుండి డబ్బులు రికవరీ చేసి బ్యాంకుకు చెల్లించేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య కు మహిళా సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. తమకు న్యా యం జరగకపోతే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కాగా రెండు రోజుల క్రితం శివశంకర్  మ హిళా సంఘం సభ్యులు కూడా ఇదే ఆర్పి తమను మోసం చేసి రూ. 20 లక్షల రుణం డబ్బులను వాడుకుందని పిడి హ నుమంత రెడ్డికి ఫిర్యాదు చేశారు. సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతుంది. రెండు రోజులైనా ఆ ఫిర్యాదు విషయంలో పిడి హనుమంత రెడ్డి సైతం ఎలాంటి విషయాలు వెల్లడించకపోవడంతో ఆయన ఆర్పీకి సహకరిస్తారేమో అని సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.