రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షరెడ్డి...
గజ్వేల్: దేశ రాజకీయాల్లో రాజరికపు పాలన కొనసాగుతుందని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షలు రెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలో సోమవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షరెడ్డి రెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుకలను బిజెపి ప్రభుత్వం అణిచివేతకు గురిచేస్తున్నారని, రాష్ట్రంలో రాచరిక పాలన పోయిందని, కానీ దేశ రాజకీయాలలో రాచరిక పాలన కొనసాగుతుందన్నారు. దేశ సంపదను ఆదాని, అంబానీలకు అమ్ముకుంటున్నారని, దీనిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.
రాహుల్ గాంధీపై అక్రమ కేసులను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడితే బిజెపి అగ్ర నాయకులకు కర్రు కాల్చి వాత పెడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్ సి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, జిల్లా మైనార్టీ వైస్ చైర్మన్ జాకీర్, యూత్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అజార్, కో ఆప్షన్ నెంబర్ గంగిశెట్టి రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి సుఖేందర్ రెడ్డి గాడిపల్లి శ్రీనివాస్, ఉడెం శ్రీనివాస్ రెడ్డి, జగ్గయ్య గారు శేఖర్, జంగం రమేష్ గౌడ్, నేత నాగరాజు, సోక్కం సురేష్, వర్గల్ సాయి, కొండపాక బాబు, కుకునూరు పల్లి వెంకటేష్, మర్కుక్ శ్యాం ప్రసాద్, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.