మహా కుంభమేళాలో తన అందంతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న పూసలమ్మే చిన్నది మోనాలిసా ప్రయాగ్‌రాజ్‌ను విడిచి వెళ్లింది. తను వెళ్తున్నట్లు వీడియో రిలీజ్ చేసిన మోనాలిసా తన కుటుంబం, తన భద్రత కోసమే ఇండోర్‌కు వెళ్తున్నట్లు వెల్లడించింది. మోనాలిసాతో సెల్ఫీలు దిగేందుకు మహాకుంభమేళాకు వచ్చిన చాలా మంది ఎగబడ్డారు. ఒకానొక సమయంలో ఆమె మీద, ఆమె కుటుంబీకుల మీద దాడి చేసినంత పని చేశారు.