calender_icon.png 19 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైదాచారితో గడిపిన క్షణాలు

12-04-2025 12:00:00 AM

‘వెగుంట’ బతికిన క్షణాలు లాగా సైదాచారితో గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాల బహుమ తులు. సైదాచారితో బయట మాట్లాడుతున్నప్పుడు వేరు, సైదాచారి కవిత్వాన్ని చదివి అర్థం చేసుకోవాలని ప్రయ త్నం చేసేటప్పుడు పూర్తిగా ఆ ప్రయాణం వేరేగా ఉంటుం ది! తెలుగు కవిత్వం అంతా రొటీన్‌గా ఉన్న వాతావరణం. ఆ వాతావరణం అంతా దాటి సైదాచారి కవిత్వమనే ఒక దీవిలోకి ప్రవేశిస్తే అంతా కొత్తదనమే.

సైదాచారి రాసిన ప్రతి కవిత్వం ఒక కొత్త భాష భావం. మనలో ఒక కొత్త విద్యుత్ ప్రవాహం ప్రకంపిస్తుంటుంది. సైదాచారి కవిత్వం చదువుతుంటే నాకు కే బాలచందర్ సినిమాలు గుర్తుకొస్తాయి, చలం గుర్తుకొస్తాడు, వృత్తి కులాల శూద్ర స్త్రీల బతుకు ప్రయాణం గుర్తొస్తుంది, అప్పుడు దాకా స్పందన లేకుండా చూసిన స్త్రీలు సైదాచారి కవిత్వం ఇచ్చిన చూపుతో కొత్తగా కనిపిస్తారు.

ఆడది అడవిగా, ఆకాశంగా, ఆత్మగా ఉన్న కవిత్వం సైదాది. రాజకీయాలు, అధికారం దగ్గరే కాదు కవిత్వం దగ్గర అధికారం చెలామణి చేస్తాయి. కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, స్త్రీవాదులు, దళితవాదులు, కవిత్వంలో కోరికలు వ్యక్తం చేసే రాజ్యాధికారం అనే అంశంతో ఆగిపోయి ఉంటారు. ఉమ్మనీళ్లలో తల్లిపాలలో సైదా కవిత్వం ఈదుతూ ప్రవహిస్తూ ఉంటుంది, కవిత్వంలో వస్తువు ఏంటి అబ్బా అంటాడు.

నిజమే సైదాచారి కవిత్వంలో నిలువెల్లా ప్రాణమున్న స్త్రీ జన్మ. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైదాచారి కవిత్వాన్ని లేదా సైదాచారిని గుర్తుపెట్టుకో వడానికి పెద్దగా రాజకీయాలు రాద్ధాంతాలు అవసరం లేదు. రెండు జాతులుగా ఉన్న ప్రపంచంలో స్త్రీని గుర్తు పెట్టుకున్న పురుషున్ని గుర్తు పెట్టుకున్న సైదాచారి గుర్తుకొస్తాడు.

సైదాచారి కవిత్వానికి రావాల్సినంత గుర్తింపు రాలేదు అని అనుకోవటం కంటే, ప్రపంచం స్త్రీ, పురు షుడు అనే రెండు జాతులతో కాక ఇంకా వేటితోనో(వస్తు మయా) ఉందని నమ్మేవాళ్లు సైదాచారిని గుర్తుపెట్టుకోవటం కష్టమే. సైదాచారి కవిత్వం కోసం స్త్రీ వెంటపడ్డాడా? లేక పురుషుడి రూపంలో ఉండి స్త్రీత్వంతో బతికాడా? ఎవరైనా జీవితాన్ని కళాత్మకంగా చూసినప్పుడు సైదాచారి కవిత్వం ఏంటో అర్థమవుతుంది.

ఓషో ఉపన్యాసంలో జీవితమే ఒక కళ అనే ఒక విశ్వ సందేశాన్ని మనం వింటాము, సైదాచారి ప్రేమ ఒక ఆది కళ అంటాడు. దుఖఃభయంలో ఉన్న వారిని ఎవరైనా లొంగ తీసుకోవచ్చు. మచ్చిక చేసుకోవచ్చు బా నిస చేసుకోవచ్చు. ఆనందంలో జీవన గానంలో నృత్యం చేసే వాడిని ఎవరూ లొంగ తీసుకోలేరు, మచ్చిక చేసుకోలేరు, బానిస చేసుకోలేరు. ప్రేమ ప్రేమ కోసమే అంటాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడం కష్టం, ఒషో అంతరాల్లోకి  వెళ్లి కళాత్మకమైన జీవితాన్ని చూట్టం కష్టం. సైదాచారి కవిత్వంలోకి వెళ్లి కళని, ప్రేమని తెలుసుకున్న వాళ్లు ఎంతమందో అంచనా వేయటం కష్టం. అందుకే తెలుగు కవిత్వం సైదాచారిని లొంగతీసుకోలేకపోయింది.

బానిసగా ఉంచటానికి సాహసం చేయలేకపోయింది. ప్రేమలో ఉన్న వాడు ఒంటరిగానే ఉంటాడు, భయంలో ఉన్నవాడు ప్రేమకు దూరంగా ఉంటాడు. సైదాచారి కవిత్వానికి దూరంగా ఉన్నవాళ్లు ఏ రకంలోకి వస్తారు? నేనైతే సైదాచారి అనే బతికిన క్షణాలలో ఆ కవిత్వంలో ఇప్పటికీ ఉన్నాను. 

    దుర్గాప్రసాద్ అవధానం, నల్లగొండ