calender_icon.png 31 March, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షణ క్షణం.. భయం భయం

25-03-2025 01:41:16 AM

  • విద్యుత్ స్థంభంపై కాసారం నుంచి విడిపోయిన 11కేవీ లైన్
  • ఓ ఇంటి నుంచి వచ్చిన సర్వీస్ వైరే ఆధారం
  • అది కాస్తా తెగితే అంతే.. పది రోజులైనా పట్టించుకోని సిబ్బంది

మహబూబాబాద్.మార్చి 24: (విజయ క్రాంతి )అసలే తండా.. అంతా అరకొర వసతులే.. ఆపై నిర్లక్ష్యానికి పరాకాష్టగా పంచా యతీ సిబ్బంది పనితీరు.. వెరసి భూక్య తండాకు మౌలిక వసతుల గండం పట్టుకుంది.ఇది చాలదు అన్నట్లుగా విద్యుత్ అధి కారుల అలసత్వంతో మరో గండం తండా వాసులకు ఏర్పడింది. మండలంలోని పలు గ్రామాల్లో పురాతన కాలంలో వేసిన విద్యు త్ స్థంభాలు వానకు తడిసి, ఎండకు ఎండు తూ ఉంటంతో అవి శిథిలావస్తకు చేరుతున్నాయి.

స్థంభాలకు బిగిం చిన కాసారాలు ఎండకు,వానకు తడిసి పూర్తిగా పాడైపోయాయి.ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని భూక్యతండాలో కొన్నేళ్ల క్రితం వేసిన స్థంభానికి ఉన్న కాసారం విరిగి దాని గుండా వెళ్తున్న 11కేవీ విద్యుత్ తీగ ఊడింది.అయితే స్థంభం నుంచి వైరైన పిన్ను,విద్యుత్ తీగ ఓ ఇంటికి కనెక్షన్ ఇచ్చిన సర్వీస్ వైర్ ఆధారంగా గాల్లో వేళాడుతోంది.

పది రోజులుగా గాల్లో వేలాడుతూ గాలి వీచినపుడు స్థంభానికి ఆనుకోవటంతో మంటలు చెలరేగుతున్నాయని తండా వాసులు తెలుపుతున్నారు. అదే సమయంలో వర్షం వచ్చిన,తీగ తెగి ఇండ్ల మీద పడిన ప్రాణాలు పోతాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై విద్యుత్ శాఖ అధికారులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలిపి పదిరోజులైనా పట్టించుకోవటంలేదని, ప్రాణాలు పోతేగాని స్పందించరా అంటూ తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని తండా వాసులు కోరుతున్నారు.