- సినిమాల్లో మహిళలకు వృత్తిపరమైన వర్క్‌స్పేస్ ఇవ్వాలి.
- లింగ వివక్షపై అవగాహన కల్పించాలి.
- ఆరోపణలు ఎదుర్కొంటున్న నటులపై శాశ్వతంగా వేటు వేయాలి
- జస్టిస్ హేమ కమిటీ లాంటివాటికి పూర్తి స్వేచ్ఛనివ్వాలి.
- 2013 చట్టం ప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ఏర్పాటుచేయాలి.
కొత్తరకం కథలు, సహజత్వంలో ఉట్టిపడే మాలీవుడ్ సినిమాలకు కేరళలోనే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఎంతో అందంగా తెరకెక్కె సినిమాలను కచ్చితంగా చూడాల్సిందే అనే స్థాయికి ఎదిగింది. అయితే అందమైన రంగుల ప్రపంచంలో చీకటి కోణాలున్నాయి. 2017లో జరిగిన ఓ ఘటన మాలీవుడ్ ఇమేజ్‌ను దెబ్బతీసింది. ‘మీటూ’ ఉద్యమానికి నాంది పలికేలా చేసింది. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌తో ప్రకంపనలు మొదలయ్యాయి.
మహిళా ఆర్టిస్టులు ఒక్కొక్కరుగా మీడియాముందుకొచ్చి తెరవెనుక చాటుమాటు వ్యవహారాలను బహిర్గతం చేస్తుండటంతో ఏకంగా ‘అమ్మ’ సంఘం రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే అందమైన కథలకు కేరాఫ్‌గా నిలిచే మాలీవుడ్ ‘కామ’ పిశాచులకు ఎందుకు అడ్డాగా మారింది? మీటూ ఉద్యమం ఎందుకు మొదలైంది? అనే విషయాలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి.
2017, ఫిబ్రవరి 17 కొచ్చిలో కదులుతున్న కారులో ఓ మహిళ నటిని అపహరించి లైంగిక దాడి చేశారు. టాలీవుడ్‌కు సుపరిచితమైన ఆ హీరోయిన్‌పై ఘటన జరగడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఇష్యూతో మాలీవుడ్ ప్రముఖ సాంకేతిక నిపుణులు, రచయితలు, నటులతో కూడిన దాదాపు 18 మంది మహిళల బృందం బాధితురాలికి అండగా నిలిచింది. న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేపట్టింది. ఫలితంగా మలయాళ నటుడు దిలీప్ కటకటాలపాలయ్యాడు.
2013లో ఓ సినిమా సెట్స్‌లో నటి మీను మునీర్‌ను ముఖేష్, మణియంపిల్ల రాజు, ఇద్వెల బాబు, జయసూర్య శారీరకంగా వేధించారు. ఒక ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నప్పుడు ఆమెను శారీరకంగా వేధించారు. అయినా కూడా నటి తన పని తానుచేసుకుంటూపోయింది. కానీ వేధింపులు భరించలేనంతగా మారాయి. సినిమా షూటింగ్ సమయంలో రెస్ట్‌రూంకు వెళ్లిన నటి మీను మునీర్ బయటకురాగానే నటుడు జయసూర్య వెనుక నుంచి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. దాంతోఒక్కసారిగా షాక్ అయ్యిందామె.
పై రెండు ఘటనలు మాత్రమే కాదు.. ఎంతోమంది మహిళా ఆర్టిస్టులు మాలీవుడ్‌లో లైంగిక వేధింపులు గురయ్యారు. గురవుతున్నారు కూడా. “సర్దుకుపోండి.. లేదా రాజీపడండి” ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చే మహిళలకు పరిశ్రమ పెద్దలు చెప్పే రెండు మాటలు ఇవే. వీటికి సిద్ధపడి శరీరాలు అర్పించుకుంటేనే భారీ పారితోషకాలతో లెక్కకు మించి అవకాశాలు కల్పిస్తారు. కాదు.. కూడదని ఎదురు తిరిగితే ఇండస్ట్రీ నుంచి ప్యాకప్.
పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు ముందుకు రారంటే వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అడపాదడపా కాకుండా ఈ తరహా వేధింపులు మాలీవుడ్‌లో సర్వసాధారణంగా మారుతున్నాయి. గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన నటీమణులంతా కోరినవిధంగా నడుచుకునేపైకి వచ్చారనే భావన ఉంది. ఇక ఓ సినిమాలో కౌగిలించుకునే పాత్రను సృష్టించి 17 సార్లు రీషూట్ చేయడం లాంటివన్నీ మాలీవుడ్ ఇమేజ్‌ను మరింత దెబ్బతీశాయి.
ప్రశ్నిస్తే ‘తెర’మరుగు
న్యాయం కోసం పోరాడేక్రమంలో అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొంటున్నారు మహిళలు. కొందరు ఏకంగా కెరీర్‌కు గుడ్ బై చెప్పి మాలీవుడ్‌ను విడిచిపెట్టారు. 2020లో నటి పార్వతి ఓ మేల్ ఆర్టిస్టుపై ‘నటుల సంఘం కీలక అధికారి’కి ఫిర్యాదు చేయడంతో అతనిపై వేటు పడింది. అయితే పరిశ్రమలో పురుషాధిక్య వ్యవస్థలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆమె ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. ఇక నటి మీను మున్నీర్ చాలా సినిమాల్లో మంచి పాత్రలతో గుర్తింపు పొందింది. 2013లో తనకు ఎదురైన కష్టాలను గుర్తుచేసుకుంటూ ఒక సినిమా షూటింగ్ లో జయసూర్య ఆమెను వెనుక నుండి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఓ నలుగురి లైంగిక వేధింపుల వల్ల కేరళను విడిచిపెట్టి చెన్నై వెళ్లిపోయిందామె. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు.. ఎంతోమంది తెరమరుగయ్యారు.
మొత్తం 17 కేసులు
‘స్త్రీలు తమ గొంతు తప్పక వినిపించాలి’ అనే ఉద్దేశంతో 2024 ఆగస్టు 19న మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేరళ ప్రభుత్వం హేమ కమిటీ ఏర్పాటుచేసింది. 235 పేజీల రిపోర్ట్‌లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. పరిశ్రమలో లైంగిక దోపిడీ, అక్రమ నిషేధాలు, వివక్ష, మాదకద్రవ్యాలు, మద్యం, కమిట్‌మెంట్, అమానవీయ పరిస్థితులు లాంటివి ఎన్నో వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది.
అయితే ఈ కమిటీ 2019 డిసెంబర్ 31న తన నివేదికను సమర్పించినప్పటికీ అందులో సున్నితమైన (బహిర్గతం చేయలేని) సమాచారం ఉందనే కారణంతో వివరాలను వెల్లడికాలేదు. హేమ కమిటీ ఏర్పాటుతో లెక్కకు మించి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి మాలీవుడ్‌లో మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఇది మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ)ను రద్దు చేయడానికి దారితీసింది. ఇక మాలీవుడ్ మీటూ సెగ బాలీవుడ్‌ను తాకింది. కంగనా రనౌత్, స్వర భాస్కర్ గొంతు విప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
నాన్నే వేధింపులకు పాల్పడ్డాడు
తమిళ సీనియర్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ హేమా కమిటీ నివేదికపై రియాక్ట్ అయ్యారు. “ఇది నిజంగా మహిళలు విజయం. మహిళ ఆర్టిస్టుల భద్రతకు హేమ కమిటీ చాలా అవసరం. వేధింపులు, అవమానాలు ప్రతి పరిశ్రమలో ఉన్నాయి. ఒక స్త్రీ మాత్రమే ఈ దుస్థితిని ఎందుకు ఎదుర్కొంటుంది? అనే అని ప్రతిఒక్కరూ ఆలోచించాలి. మగవాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ప్రతి మహిళకు అండగా నిలబడాలి. మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడాలి. ఇక నా విషయానికి వస్తే 16 ఏళ్ల వయసులోనే తండ్రి నుంచి ఇబ్బందులు పడ్డాను. ఎదురించి మాట్లాడటంతో తల్లితో పాటు నేనూ వేధింపులకు గురయ్యా” అని చెప్పుకొచ్చింది ఖుష్బూ.
ఖుష్బూ సుందర్ టాలెంట్ ఉన్నా తొక్కేస్తారు
మాలీవుడ్ మీటూ బాలీవుడ్‌కు పాకడంతో కంగనా రనౌత్ రియాక్ట్ అయ్యారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హాయాం లో తలెత్తిన పరిస్థితులపై ఎమర్జెన్సీ మూవీతో ప్రేక్షకుల ముందు కొస్తోంది. మీటూ అంశంపై మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్ లో టాలెంట్ ఉన్నవాళ్లను ఎదగనివ్వరు అని కామెంట్స్ చేసింది. బాలీవుడ్ అంతా ఈర్శ్య, అసూయలో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ పెద్దల కారణంగా చాలామంది నటీమణులు కెరీర్‌ను కోల్పోయారని వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ టాలెంట్ తో పైకొచ్చిన పరువు తీసి తెరమరుగు చేస్తారని ఆరోపించింది.
రనౌత్