calender_icon.png 14 March, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి సమాజం మొల్లను ఆదర్శంగా తీసుకోవాలి

13-03-2025 08:54:28 PM

తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేదునూరి కనకయ్య

ముషీరాబాద్,(విజయక్రాంతి): నేటి సమాజం మొల్లను ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిదునూరి కనకయ్య(Telangana Kummari Association State President Nedunuri Kanakaiah) అన్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘం(Telangana State Kummari Association) హైదరాబాద్ ఆధ్వర్యంలో ట్యాంక్ బాండ్ పై మొల్ల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 రాష్ట్ర అధ్యక్షులు,తెలంగాణ ఎకానమిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య  మాట్లాడుతూ... మొల్ల  సామాన్య కుమ్మర కులంలో జన్మించి 15వ శతాబ్దంలోనే స్వయంగా చదువుకుని సంస్కృతంలోని రామాయణంను తెలుగులో సరళ సుందరంగా రచించి ఆదర్శంగా నిలిచా రన్నారు.

ప్రభుత్వం సావిత్రిబాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహించినట్లె మొల్ల జయంతిని ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా నిర్వహించి భారతీయ సాహిత్య రంగంలో మొల్ల సాహిత్య ప్రభావాన్ని ప్రచారం చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సలహాదారులు టీ యాదగిరి, మలికంటి వెంకన్న మాట్లాడుతూ... సంస్కృతంలో రాసిన వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి సరళ భాషలో రామాయణాన్ని రాసిన మొల్ల సాహిత్య చరిత్రలో  చేసిన కృషిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధరిపెల్లి మహేందర్ మాట్లాడుతూ.. మొల్ల తాత తిక్కన దగ్గర లేఖకునిగా పనిచేశారని పండిత కుటుంబానికి చెందిన మొదటి మహిళా కవయిత్రి అన్నారు. ఈ జయంతి కార్యక్రమంలో కుమ్మర సంఘాల నాయకులు మువ్వల అశోక్ 'లక్ష్మీ నారాయణ' కామిశెట్టి రాజేందర్ 'కాసుల జగన్' ఎ మల్లేశం' డాక్టర్' రవి శంకర్ ధామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.