calender_icon.png 24 December, 2024 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోక్షగుండం..యువ ఇంజినీర్లకు ఆదర్శం

16-09-2024 01:14:43 AM

హైడ్రాకు పార్టీలు, కులాలు, మతాలు లేవు

మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఘనంగా ఇంజినీర్స్ డే 

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాం తి): దేశ నిర్మాణం కోసం జీవితాంతం కృషి చేసిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను యువ ఇంజినీర్లు ఆదర్శంగా తీసు కోవాలని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. విశ్వేశ్వర య్య జయంతి సందర్భంగా ఆదివారం ఎర్రమంజిల్‌లోని ఈఎన్సీ భవన్‌లో ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో ఇంజినీర్స్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా మంత్రు లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. 

హైడ్రాకు తారతమ్యాలు లేవు

మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ హైడ్రా కు పార్టీలు, కులాలు, మతాలు లేవన్నారు. కాబట్టే అన్ని రాజకీయ పార్టీలు హైడ్రాకు మద్ధత్తు ఇచ్చి హైదరాబాద్‌కు మాస్టర్ ప్లాన్ గీసిన విశ్వేశ్వరయ్యకు నివాళి అర్పించాలని మంత్రి సూచించారు. 1908లో భారీ వరదలు వచ్చి హైదరాబాద్ మొత్తం మునిగిం దని, వేలాది మంది వరదల్లో గల్లంతయ్యారని తెలిపారు. నిజాం విశ్వేశ్వరయ్య గురించి తెలుసుకుని హైదరాబాద్‌కు ఆహ్వానించి నగరంలో ఫ్లడ్ ప్రొటెక్షన్ అండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు గురించి విన్నవించారని మంత్రి గుర్తు చేశారు.

హైదరాబాద్ భౌగోళిక స్థితిగతులపై విశ్వేశ్వరయ్య పూర్తిగా అధ్యయనం చేసి, నగరం పైభాగంలో ఉన్న 788 చెరువులకుగాను  వరదల కారణంగా 221 చెరువు లు పూర్తిగా ధ్వంసమయ్యాయని గుర్తించారని తెలిపారు. వరదను తట్టుకోవాలంటే నగరానికి పైభాగంలో ఒక పెద్ద రిజర్వాయర్ కట్టాలని విశ్వేశ్వరయ్య ప్రతిపాదించారని.. అందులో భాగంగానే మూసీకి ఉపనది ఈసీపై  హిమాయత్‌సాగర్ నిర్మించారని వివరించారు. హైదరాబాద్ పైభాగంలో ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయో మనమంతా ఒకసారి ఆలోచించాలని కోరారు. అందుకే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటుచేసి మళ్లీ 1908 నాటి వరదలను పునరావృతం కాకుండా ఆపే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. 

రైతుల్లాగే ఇంజినీర్లు..

దేశానికి అన్నంపెట్టే రైతన్నలు ఎంత ముఖ్యమో.. ప్రాజెక్టులు బ్రిడ్జీలు, రోడ్లు, బిల్డింగులు నిర్మించే ఇంజినీర్లు కూడా అంతే ముఖ్యమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఇం జినీర్లంటే ప్లాన్లు గీసే ఆర్టిస్టులు కాదని, నాగరికత అనే వాహనాన్ని నడిపించే ఇంజిన్లని మంత్రి కొనియాడా రు. ఇంజిన్ లేకపోతే వాహనమే లేదని, అలాగే ఇంజినీర్లు లేకపోతే చరిత్ర నిర్మాణమే లేదని ఆయన పేర్కొన్నారు.